Breaking News

పుల్లేటి కాలువ విస్త‌ర‌ణ ప‌నుల కోసం కమీష‌న‌ర్ ను క‌లిసిన ఎంపి కేశినేని, ఎమ్మెల్యే గ‌ద్దె

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పుల్లేటి కాలువ విస్తరణ పనుల గురించి కమిషనర్ ధ్యానచంద్ర ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ గురువారం క‌లిశారు.

3వ డివిజ‌న్ లోని గుణ‌ద‌ల పంచాయ‌తీ ఆఫీస్ పోస్టాపీస్ ఏరియాల్లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), తూర్పు నియోజకవర్గం శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ పర్య‌టించి పుల్లెటి కాలువ స‌మ‌స్య‌ను ప‌రిశీలించారు. అనంత‌రం స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రిచటం కోసం ప్ర‌జాప్ర‌తినిధులు ఇద్ద‌రు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. పుల్లేటి కాలువ డ్రైన్ నిర్మాణం చేప‌ట్టానికి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు.

అలాగే నగరంలో వీధి వ్యాపారస్తుల సర్వే తో వీధి వ్యాపారస్తుల వివరాలు సేకరిస్తున్నామని, సర్వే పూర్తయిన అనంతరం వారికి గుర్తింపు కార్డులను జారీ చేయ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెడ్ జోన్, గ్రీన్ జోన్, యాంబర్ జోన్ ను, గుర్తిస్తున్న‌ట్లు వివ‌రించారు. న‌గ‌రంలో బంగారు కుటుంబాల‌కు కోసం డివిజ‌న్ కి 5 కుటుంబాల‌ను ఎంపిక చేయాల‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ క‌మీష‌న‌ర్ కి సూచించారు.

ఈ సమావేశంలో టిడిపి అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకటనారాయణ, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *