Breaking News

రాష్ట్రాన్ని విద్యాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌ట‌మే మంత్రి నారా లోకేష్ ల‌క్ష్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-ఆధునీక‌రించిన బి.ఎస్.ఆర్.కె మున్సిప‌ల్ హైస్కూల్ ప్రారంభోత్స‌వం*
-ప్రారంభించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్
-రెండు కోట్ల ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో రెండో అంత‌స్తు నిర్మాణం
-ఉపాధ్యాయుల‌ను స‌త్క‌రించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని విద్యాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌ట‌మే ల‌క్ష్యంగా విద్య ఐటీ శాఖ‌ల మంత్రి నారాలోకేష్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలలో విద్యార్ధుల సంఖ్య పెంచి నో అడ్మిష‌న్ బోర్డులు పెట్టే విధంగా పాఠ‌శాల విద్య వ్య‌వ‌స్థ‌లో వినూత్న మార్పుల‌కు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్, జ‌మ్మిచెట్టు సెంట‌ర్ ద‌గ్గ‌ర ఆధునీక‌రించిన‌ బి.ఎస్.ఆర్.కె మున్సిప‌ల్ హైస్కూల్ తరగతి గదుల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం శ‌నివారం జ‌రిగింది. నూత‌నంగా ఏర్పాటు చేసిన రెండో అంత‌స్తులోని త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఎంపీ కేశినేని శివనాధ్ శివ‌నాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి తో కలసి ప్రారంభించి తరగతి గదులను ప్రరిశీలించారు. అలాగే ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఈ పాఠ‌శాల‌లో కేశినేని ఫౌండేషన్ ద్వారా త‌న సొంత నిధుల‌తో ఏర్పాటు చేయించిన లాంగ్ జంప్ పిట్ ను ప‌రిశీలించారు. అలాగే టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా పాఠ‌శాల‌లోని ఉపాధ్యాయుల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్, టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా శాలువాతో స‌న్మానించి జ్ఞాపిక‌లు బ‌హుక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా అలాగే దాతల సహకారంతో రెండు కోట్ల 10లక్షల మేర నిధులతో రెండో అంతస్థు నిర్మాణం చేయడంతో పాటు, 14 త‌ర‌గ‌తి గ‌దులు అద‌నంగా నిర్మించటం జ‌రిగింద‌న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఘ‌నంగా జ‌రిగిన టీచర్స్ డే వేడుకల్లో ఉత్తమ ఉపాధాయ్యులను సత్కరించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఇందుకు దాతలు కూడా సహకరించాలని చెప్పారు.

అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో మొఘల్ రాజపురం జమ్మిచెట్టు వద్ద వున్నా బి.ఎస్.ఆర్.కె స్కూల్ కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. 2014 లో చంద్రబాబు పిలుపు మేరకు అమ్మ అసోసియేషన్ ముందుకు వచ్చి పాఠశాల అభివృధికి సహకరించారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో చదువుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వ‌టం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్ధులు నాణ్య‌మైన విద్య అందుకునేందుకు అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

కార్పొరేట‌ర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని
శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. పాఠ‌శాల‌కు అవ‌స‌ర‌మైన రంగులు త్వ‌ర‌లో వేయిస్తామ‌న్నారు.. ఈ స్కూల్ అభివృద్దికి అమ్మ అసోసియేష‌న్ ముందు నుంచి స‌హాయ స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌న్నారు. ఈ పాఠ‌శాలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ల స‌హ‌కారంతో కృషి చేస్తాన‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో హెడ్మాస్టార్ శ్రీనివాస్, 8వ డివిజ‌న్ ప్రెసిడెంట్ కొత్త‌ప‌ల్లి ర‌మేష్, సెక్ర‌ట‌రీ నారు రామారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, మోడ‌ర‌న్ అకాడ‌మీ ఫౌండ‌ర్ సుంక‌ర పాపారావు, అమ్మ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ స‌తీష్, మాజీ ప్రెసిడెంట్ యార్ల‌గడ్డ సుబ్బారావు, మాజీ కార్పొరేట‌ర్ దోమ‌కొండ జ్యోతి, టిడిపి మ‌హిళ నాయ‌కురాలు అరుణ‌, దయాల శిరీష గాంధీ, జ్యోతి, , టిడిపి నాయ‌కులు చ‌లసాని ర‌మ‌ణ‌, యెర్నేని వేద‌వ్యాస్, మ‌ల్లెల రామ‌కృష్ణ‌, గ‌ద్దె రంగ‌రావు, శివ‌య్య, గెడ్డం హ‌రి ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *