Breaking News

మార్షస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రాంగుళo రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై సమీక్ష

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
మార్షస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రాంగుళo సెప్టెంబర్ 15 వ తేదీన తిరుపతి లోని రామాపురం లోని బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శించి అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో మారిషస్ ప్రధానమంత్రి పర్యటన ప్రదేశాలలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం ASL లో ( ముందస్తు భద్రత లైజన్ ) భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, సంబంధిత అధికారులతో మారిషస్ ప్రధాని పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్షస్ ప్రధాని సెప్టెంబర్ 15 న ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుపతి లోని రామాపుర లో ఉన్నటువంటి బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శించి, అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారని అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగుప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు అంబులెన్స్, స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు అమర ఆసుపత్రి, నారాయణాద్రి ఆస్పత్రి హాస్పిటల్ వైద్య సిబ్బంది వారికి కేటాయించిన ప్రదేశాలలో విధులు నిర్వహించాలని తెలిపారు. అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాల ఏర్పాటు పై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, బ్రహ్మ రిషి ఆశ్రమం అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *