Breaking News

మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు రెండు వారాల పాటు స్వస్త్ నారి సశక్త్ అభియాన్ (ఆరోగ్య వంత మైన మహిళ- శక్తి వంత మైన కుటుంబం) అను సమగ్ర ఆరోగ్య ప్రచార్ మరియు సేవా కార్యక్రమము నిర్వహించ వలసినదిగా ఆదేశాలు జారీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్యాన్ని కాపాడి కుటుంబం బలపరిచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేయడమైనది.
కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు
1. మహిళ ఆరోగ్యం పై అవగాహన పెంచడం.
2. మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడం.
3. పోషకాహారాన్ని ప్రోత్సహించడం
4. కుటుంబాలను స్వశక్తి చేయడం.
ఈ కార్యక్రమం యొక్క లాభాలు
1. మహిళ ఆరోగ్యం బలపడితే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది.
2. తల్లి ఆరోగ్యంగా ఉంటే తన పిల్లలు ఆరోగ్యం గా పెరుగుతారు.
3. మహిళా శక్తి సమాజ శక్తికి పునాది అవుతుంది.
ఈ కార్యక్రమం యొక్క నినాదాలు
1. తల్లి ఆరోగ్యం పిల్లలకు బలమైన భవిష్యత్
2. స్త్రీ శక్తి కుటుంబానికి సంతోషం
3. ఆరోగ్య అవగాహన- సమాజాభివృద్ధి
4. ఆరోగ్య వంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి ఆధారం.
5. ఆరోగ్య వంతమైన స్త్రీ అభివృద్ది చెందిన సమాజానికి ఆధారం.
కార్యక్రమానికి సంబంధించి జిల్లా లోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏరియా హాస్పిటల్స్, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు వైద్య నిపుణులు మరియు పారా మెడికల్ సిబ్బంది ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా ఆసుపత్రుల కో ఆర్డి నేటర్ మరియు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రి సమన్వయం తో నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఆదేశాలిచ్చారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణ సంబంధిత ఆరోగ్య కేంద్ర/ ఆసుపత్రి వైద్యాధికారులు నేత్రత్వం లో నిర్వహించ బడుతుంది. అంతే కాకుండా జిల్లా మండల మరియు గ్రామ స్థాయిలో వైద్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయత్ రాజ్ శాఖ మునిసిపల్ శాఖ, డిఆర్ డిఏ మొదలగు శాఖల సమన్వయం తో ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహించ బడుతుంది.

ప్రత్యేక వైద్య శిబిరాలలో అందించే వైద్య సేవలు
1. మహిళల లో గుండె జబ్బులు, మధు మేహం, నోటి కాన్బర్‌ మరియు గర్భాశయ కాన్సర్‌ లను పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్స లను మరియు రెఫరల్ సేవలను అందించడం జరుగుతుంది.
2. మహిళలు మరియు కిషోర బాలికలలో రక్త హీనత ను గుర్తించి తగిన చికిత్సలను చేయడం.బాలికలలో రక్తహీనత ను గుర్తించి తగిన చికిత్స చేయడం.
3. గర్భవతుల ను పరిక్షించి సరైన పోషకాహారం ఆవశ్యకతను తీసుకోవల్సిన జాగ్రత్తల ను గురించి కౌన్సిలింగ్ నిర్వహించడం.
4. కిశోర బాలికలలో హిమా గ్లోబిన్ పరీక్షలు చేయడం,రక్త హీనత కల వారికి చికిత్స చేయడం జరుగుతుంది. గర్భిణులకు ఎమ్ సి పి కార్డ్ లు అందజేయడం జరుగుతుంది.
5. పిల్లల లో సికిల్ సెల్ అనీమియా గుర్తించి అవసరమైన వారికి చికిత్స చేయడం జరుగుతుంది.
6. పిల్లలకు మరియు గర్భిణి స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలు అంద జేస్తారు.
7. యుక్త వయస్సు బాలికలు మరియు మహిళల కు బహిస్టు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది.
8. రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది
9. ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు అందించడం జరుగుతుంది.
10. ప్రత్యేక అవగాహనా కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతుంది
కనుక జిల్లా వ్యాప్తంగా జరిగే ఈ వైద్య శిబిరాలను ప్రజలందరూ ఉపయోగించుకోవలసినదిగా తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఒక ప్రత్యేక ప్రకటన లో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *