Breaking News

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం ఈవీఎమ్ గోడౌన్ ను పరిశీలించినట్లు తెలిపారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం ఉదయం ఈవీఎమ్ గోడౌన్ ను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా, స్థానిక F.C.I గోడౌన్ లో భద్రపరచిన ఈవీఎమ్ గోడౌన్ ను కలెక్టర్, రాజమండ్రి ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్, మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించడం జరిగింది. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నియోజకవర్గాలు వారీగా ఈవీఎమ్‌లను భద్రపరచిన గోడౌన్ ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి, తనిఖీలు చేపట్టడం, సంబంధిత రిజిస్టర్‌లో సంతకాలు చేయించడం జరుగుతుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎమ్‌లను నిరంతర CCTV కెమెరాల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఈవీఎమ్ నోడల్ అధికారి రాజమండ్రి ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, అర్బన్ తహసిల్దార్ పి.హెచ్.జి. ఆర్. పాపారావు, రాజకీయ పార్టీల ప్రతి నిధులు బి. రామచంద్ర రావు( BJP), దత్తాత్రేయ శర్మ – BJP ఆనంద్ – TDP,
నాగరాజు – జనసేన , రెవెన్యూ, భద్రత సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *