రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో “వికాస” ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ జాబ్ మేళా లో ఎంపిక అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం అందచేశారు. కలెక్టర్ విద్యార్థులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు, అందులో 107 మంది ఎంపికయ్యారని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఆఫర్ లెటర్స్ ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వికాస సిబ్బంది మరియు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News