Breaking News

తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మూరు కార్యాలయంలో “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు బొమ్మూరు కార్యాలయంలో “సూపర్ GST – సూపర్ సేవింగ్స్” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రచారం 25-09-2025 నుండి 19-10-2025 వరకు కొనసాగనుంది అని DMHO డాక్టర్ K. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు, వినియోగదారులకు మరియు వ్యాపార వర్గాలకు GST సంస్కరణల ప్రయోజనాలను అవగాహన చేయించడం. ముఖ్యంగా మందులు, వైద్య పరికరాలు మరియు ఆరోగ్య బీమా ధరల తగ్గింపులను స్పష్టంగా తెలియజేయడం ప్రధాన లక్ష్యం.

కేంద్రబిందువులు:
GST స్లాబులు 5% నుండి 2% (5% మరియు 18%)కి తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన.
ప్రజా వర్గాలలో ప్రతి వర్గం చురుకైన భాగస్వామ్యం కలిగి ఉండేలా ప్రోత్సహించడం.

అవగాహన కార్యక్రమాలు:
VHCలు, PHCలు, CHCలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు లో ప్రత్యేక ప్రచారాలు.
ASHAలు, ANMలు, MLHPలు ద్వారా ఇంటింటి సందర్శనలు, సమావేశాలు.
మాస్ కమ్యూనికేషన్: పత్రికలు, రేడియో, సోషల్ మీడియా, పోస్టర్లు, బ్యానర్లు.
హెల్ప్ డెస్క్‌లు: ప్రతి ఆసుపత్రిలో GST హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
డాక్యుమెంటేషన్: రోజువారీ ఫోటోలు, వీడియోలు, నివేదికలు GST మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయడం.

వారం వారీ ప్రణాళిక:
వారం 1 (25.09.25–29.09.25): మందులపై ఇంటింటి ప్రచారం
వారం 2 (30.09.25–06.10.25): PHCలు, CHCలు, ఆసుపత్రులలో అవగాహన
వారం 3 (07.10.25–11.10.25): ఆరోగ్య బీమా పై అవగాహన సమావేశాలు
వారం 4 (12.10.25–16.10.25): ప్రజా సమావేశాలు, పర్యవేక్షణ
వారం 5 (17.10.25–19.10.25): IEC ప్రచారం – ప్రత్యేక అవగాహన డ్రైవ్‌లు
జిల్లా వ్యాప్తంగా ప్రతి స్థాయిలో (డివిజనల్, మండల, PHC/UPHC, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నోడల్ అధికారులు ప్రత్యేక సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తారు.
ఈ కార్యక్రమం లో DR. K. శ్రీవల్లి, జిల్లా ఇమ్మ్యూనైజేషన్ అధికారి, DR. P. కోమల, ప్రోగ్రాం ఆఫీసర్ , సెక్షన్ హెడ్స్, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *