-వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాల్మీకి చిత్ర పటానికి పూలమాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ శాఖ జిల్లా అధికారి జి రమేష్, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు భాగస్వాములై వాల్మీకి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.
Prajavartha Online Telugu News