Breaking News

గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని గృహ నిర్మాణాల పురోగతిపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి గృహ నిర్మాణ పురోగతిపై ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నెలకు కేవలం 2 లేదా 3 మాత్రమే పూర్తి చేస్తున్నారని ఇది ఎంత మాత్రం సరైనది కాదన్నారు. వచ్చే మార్చి 31వ తేదీ లోపు నిర్మాణాలను పూర్తి చేస్తేనే లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయని, ఆ లోపుగా పూర్తి చేయకపోతే పథకం ముగింపు అవుతుందని ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు, లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కృషి చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతిని వివరించాలన్నారు. వెలుగు పథకం కింద కూడా అవసరమైన వారికి రుణాలు అందిస్తారని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కలిగించాలన్నారు.

జిల్లాలోని కొన్ని లేఔట్లను మెరక చేయవలసిన అవసరం ఉందని, దానివల్ల లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అలాంటి సమస్యలు ఉన్న లేఅవుట్ల వివరాలను నియోజకవర్గాలవారీగా అందించాలని అధికారులకు సూచించారు. ఈనెల 21వ తేదీన పురోగతిపై మరల సమీక్షిస్తామని, ఆ లోపుగా వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లి పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ కార్య నిర్వహణ అధికారి బుజ్జి బాబు, డిఆర్డిఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద కుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి చిన్న నరసింహులు, మార్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, మార్కెటింగ్ ఎడి నిత్యానంద్, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ సంస్థ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *