Breaking News

తీర ప్రాంత భద్రతకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో తీర ప్రాంత భద్రతకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులు ఆదేశించారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో తీర ప్రాంత భద్రత ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని తీరప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.
కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో రీ సర్వేనెంబర్ 113లో వర్ల గొంది తిప్ప సముద్రతీర పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 ఎకరాల భూమికి సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.

అలాగే కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలోని పాలకాయ తిప్ప మజరా గ్రామంలో రీ సర్వే నంబర్ 794/4 లో సముద్రతీర పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 66 సెంట్లు భూమికి సంబంధించి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. వర్ల గొంది తిప్ప పోలీస్ స్టేషన్ కు అవసరమైన మంచినీటి సరఫరాను ఏర్పాటు చేయాలన్నారు. పాలకాయ తిప్ప, ఓర్ల గొంది తిప్ప, గిలకలదిండి పోలీస్ స్టేషన్ల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మంగినపూడి బీచ్ వద్ద ప్రమాదాల నివారణకు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీ వి నాయుడు మెరైన్ డి.ఎస్.పి బాలిరెడ్డి నగర డి.ఎస్.పి సిహెచ్ రాజా మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, ఆర్డీవో స్వాతి మెరైన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *