Breaking News

ఎస్ ఈ సత్యానందం విశిష్ట సేవలు అందించారు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో విద్యుత్ శాఖ ఎస్ ఈ సత్యానందం విశిష్ట సేవలు అందించారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు. సి పి డి సి ఎల్ ఎస్ ఇ సత్యానందం చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి లభించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో వారికి అభినందన కార్యక్రమం జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ అని పేర్కొంటూ ఆ శాఖ సరిగా పనిచేయకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు సి పి డి సి ఎల్ ఎస్ ఈ సత్యానందం ఎంతగానో కృషి చేశారన్నారు. అలాగే ఇటీవల సంభవించిన మోంత తుఫానులో కూడా దెబ్బతిన్న, పడిపోయిన విద్యుత్ స్తంభాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. తదుపరి విద్యుత్ శాఖ ఎస్.ఈ. సత్యానందం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో తాను సజావుగా విధులు నిర్వహించగలిగానన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ ఎస్.ఈ. సత్యానందంను శాలువలు, జ్ఞాపికలు తో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, హౌసింగ్ జిల్లా అధికారి పోతురాజు, పంచాయతీరాజ్ ,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు రమణ రావు, సోమశేఖర్, డిఎస్ఓ మోహన్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ యుగంధర్, జిల్లా విద్యాధికారి పివిజే రామారావు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *