Breaking News

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమం వేగవంతం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ నగరంలోని వారి క్యాంపు కార్యాలయం నుండి స్వమీత్వ సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 250 గ్రామాల్లో స్వమిత్వా సర్వే చేయవలసి ఉండగా ఇప్పటివరకు 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందని, అందులో వెక్టరైజేషన్ కేవలం 110 గ్రామాల్లోనే పూర్తి చేశారన్నారు. అందులో ఎక్స్టెండెడ్ గ్రామకంఠం (ఈ జి కే) 151 గ్రామాల్లో పూర్తయిందన్నారు. గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ చేయడంతో పాటు ఏరోజుకారోజు వెక్టరైజేషన్ కూడా తప్పనిసరిగా చేయాలన్నారు.

సర్వేలో వెక్టరైజేషన్ చాలా ముఖ్యమని పేర్కొంటూ ఇంకా కొన్నిచోట్ల ఎక్కడైజేషన్ సరిగా పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇకనైనా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే కార్యక్రమం కేవలం పంచాయితీ కార్యదర్శులదే అనే భావనతో ఉన్నారని అలా కాకుండా గ్రామ మండల సర్వేయర్లు అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి సర్వే సజావుగా పూర్తి చేయాలన్నారు.

ఇంకా గన్నవరం బాపులపాడు పామర్రు పెనమలూరు కంకిపాడు మండలాలు సర్వేలో వెనుకబడ్డాయని అక్కడ ఇకనైనా ప్రత్యేక శ్రద్ధ వహించి సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు.
వచ్చేవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా స్వమిత్వా సర్వే సమీక్షించనున్నారని ఆలోగా మంచి పురోగతి సాధించాలన్నారు. రోవర్సు ఎక్కడ అవసరమో అక్కడికి వెంటనే తరలించి సర్వే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు.

ఈ గూగుల్ మీట్ లో జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె అరుణ, సర్వే భూ రికార్డుల ఏడి జోషిలా, పలువురు డి ఎల్ డి వో లు, డి ఎస్ ఎల్ ఓ లు, ఎంపీడీవోలు మండల సర్వేయర్లు పంచాయతీ కార్యదర్శులు గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *