Breaking News

పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

-ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు రూ.700 కోట్లు అందజేత
-అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ నిధులు
-రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి అడుగులు
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన పేదలకు సుమారు రూ.700 కోట్లకు పైగా ఆర్థిక సాయం చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు అద్దంకి నియోజకవర్గంలోని కొరిశపాడు మండలం, పీ.గుడిపాడు గ్రామంలో నిర్వహించిన రైతు సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. నేటికి అద్దంకి నియోజకవర్గంలోని 1,897 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.17.69 కోట్ల విలువైన చెక్కులు అందజేసినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడిన మంత్రి గొట్టిపాటి… ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకం ద్వారా రూ. 20 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో ఈ మొత్తాన్ని విడతల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను ఎత్తి చూపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇనాం భూములకు పెట్టబడి సాయాన్ని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇనాం భూములకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. రైతన్నలకు వ్యవసాయ పనిముట్లను 90 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తుందన్నారు.

బీటీ రోడ్డు ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

రైతుల సేవలో మన ప్రభుత్వం కార్యక్రమం అనంతరం పి.గుడిపాడు గ్రామంలో కొత్తగా రూ.1.77 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. NH-5 నుంచి పి.గుడిపాడు వరకు రూ. 80 లక్షలతో నిర్మించిన తారు రోడ్డును, NH-5 నుంచి అలవలపాడు వరకు రూ. 60 లక్షలతో తారు రోడ్డును, NH-5 నుంచి కుర్రవానిపాలెం వరకు రూ. 17 లక్షలతో నిర్మించిన మరో తారురోడ్డుతో పాటు రూ. 20 లక్షలతో నిర్మించిన పి.గుడిపాడు గ్రామంలో సిమెంట్ రోడ్లు, సైడు డ్రైన్లను ప్రారంభించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *