తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిలో పండగ వాతావరణంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో కాలనీ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, యువనాయకుడు ఆరాణి మదన్ మోహన్, నగర అధ్యక్షులు రాజారెడ్డి చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, గత సారి రాయలసీమ ప్రాంతంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన నియోజకవర్గంగా తిరుపతి నిలిచిందని గుర్తు చేశారు. అదే ఉత్సాహంతో, అదే సమన్వయంతో ఈసారి కూడా తిరుపతి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మండలం, ప్రతి వార్డు స్థాయిలో బాధ్యతగా పనిచేసి సభ్యత్వ లక్ష్యాలను అధిగమించాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే, పవన్ కళ్యాణ్ దూరదృష్టితో ఆలోచించి పార్టీ భవిష్యత్తు దృష్ట్యా క్రియాశీలక సభ్యత్వ విధానాన్ని తీసుకువచ్చారని హరిప్రసాద్ గారు తెలిపారు. నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరికీ భద్రత, గౌరవం, ప్రాధాన్యత కల్పించే విధంగా సభ్యత్వాన్ని రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారేనని ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా నిలిచే సంకల్పంతో ఈ కార్యక్రమం రూపొందించబడిందన్నారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ శక్తిని మరింత బలపరచి, ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని హరిప్రసాద్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News