Breaking News

కేకే ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

పుంగనూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ సభ్యత్వ కార్యక్రమ సమన్వయకర్తగా నియమితులైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ మరియు జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే ఆధ్వర్యంలో పుంగనూరులో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకోవడం ద్వారా నాయకత్వ లక్ష్యాల వైపు ముందడుగు వేయవచ్చని, కార్యకర్తలకు ప్రమాద భీమా కింద రూ.5 లక్షల రక్షణ కల్పించబడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… జనసేన పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాకుండా, ప్రజల ఆశయాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు, సామాజిక న్యాయం సాధించేందుకు ఈ సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కట్టుబడి పని చేయాలని సూచించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిజాయితీ, పారదర్శకత, సేవాభావం అనే మూడు సూత్రాలతో పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. జనసేన పార్టీ కార్యకర్త ఒక సామాన్య సభ్యుడిగా కాకుండా, సమాజ మార్పుకు దారితీసే శక్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రమాద భీమా పథకం ద్వారా కార్యకర్తల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, పార్టీ తమ సైనికులను ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ సభ్యత్వాన్ని తీసుకెళ్లి, పుంగనూరు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
చివరిగా, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ఎదగడానికి కార్యకర్తల ఐక్యత, కృషి, నిబద్ధత అత్యంత అవసరమని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *