Breaking News

ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం . గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్లాస్టిక్ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం అని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం కోనేరు బసవయ్య చౌదరి హై స్కూల్ పటమట నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని ముఖ్యంగా డిస్పోజబుల్ గ్లాసుల్లో, పేపర్ ప్లేటులో వేడివేడి ఆహారం తినటం వల్ల వాటిపై ఉన్న ప్లాస్టిక్ పూత కలిగి శరీరంలోకి ప్రవేశించి అవి క్యాన్సర్ కణాలు గా మారే అవకాశాలు ఉంటాయని, కావున సింగిల్ యూస్ ప్లాస్టిక్ కచ్చితంగా నిషేధించాలని అందరికీ పిలుపునిచ్చారు అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిండకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు సానిటరీ నాకిండ్లు ప్లాస్టిక్ బాటిళ్లు వేయకూడదన్నారు. మొట్టమొదటిసారిగా పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న మొదటి అడుగు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని, ఆంధ్రప్రదేశ్లో హరితాంధ్రప్రదేశ్ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇప్పుడే కాకుండా గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడే మొదలుపెట్టారని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2025 26 లో కూడా విజయవాడ నగరానికి ఉత్తమమైన స్థానం నిలబెట్టుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని ఒకవైపు అధికారులు ప్రజాప్రతినిధులు తమ వైపు నుంచి పూర్తి స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ లో ఉత్తమమైన స్థానం నిలబెట్టుకునేందుకు విస్తృత కృషి చేస్తున్నప్పటికీ ప్రజలు కూడా వారికి సహకరించి బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలు వేయకుండా సైడ్ కాలవల్లో ప్లాస్టిక్ బాటిళ్లు వేయకుండా సహకరించాలని విన్నవించారు.

ఈ సందర్భంగా విజయవాడ దగ్గర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నగరంలో ఇప్పటికే పూర్తిగా నిషేధించామని ప్రజలు కూడా వారి తరఫున సింగల్ యూస్ ప్లాస్టిక్ ని వాడకుండా కేవలం పర్యావరణహితమైన వస్తువులనే వాడాలని గుడ్డ సంచులను తమతో పాటు బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాలని, ప్రజలు గుడ్డ సంచులను తమతో పాటు తీసుకువెళ్లటం ఒక అలవాటుగా మార్చుకోవాలని, స్వచ్ఛ సర్వేక్షన్ 2025- 26 లో విజయవాడ నగరానికి ఉత్తమమైన స్థానం రావాలంటే ప్రజలు వారి అభిప్రాయాలను తెలుపరాలని, ప్రతి ఒక్కరు విజయవాడకి ఓటు వేయాలని అన్నారు. ఏపీ పొల్యూషన్ బోర్డ్ వారి సౌజన్యంతో గుడ్డ సంచులను లాంచ్ చేయటమే కాకుండా అక్కడ వచ్చిన ప్రజలందరికీ గుడ్డ సంచులను పంచి కేవలం గుడ్డ సంచులను వాడమని వాళ్లందరికీ విన్నవించారు.

తదుపరి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ తీసుకుంటూ అక్కడికి వచ్చిన ప్రజలకు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు. ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా ప్రజల్లో డెంగ్యూ వ్యాధిపై అవగాహన పెంపొందించడం, దోమల నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతోందని, ఈ సందర్భంగా పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, యాంటీ లార్వల్ చర్యలు, ఫాగింగ్ కార్యక్రమాలు, నిల్వ నీటి తొలగింపు కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారని. వార్డు స్థాయిలో అధికారులు, సిబ్బంది ఇంటింటి తనిఖీలు నిర్వహించి దోమల పెరుగుదలకు కారణమయ్యే పరిస్థితులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారని అన్నారు.

ఈ సంవత్సరపు జాతీయ డెంగ్యూ దినోత్సవం థీమ్:
“తనిఖీ చేయండి – శుభ్రపరచండి – మూతపెట్టండి”
(Check – Clean – Cover) డెంగ్యూ వ్యాధి Aedes దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు శుభ్రమైన నిల్వ నీటిలో పెరుగుతాయని, అందువల్ల ప్రజలు తమ ఇళ్ల పరిసరాలలో కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చెక్కలు, పాత టైర్లు, ఫ్రిజ్ ట్రేలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

వారానికి ఒకసారి నీటి నిల్వ పాత్రలను తనిఖీ చేసి శుభ్రం చేయాలని, నీటి ట్యాంకులు, డ్రములు, బిందెలకు తప్పనిసరిగా మూతలు పెట్టాలని, పూర్తి చేతుల దుస్తులు ధరించాలని, దోమతెరలు, దోమ నివారణ క్రీములు ఉపయోగించాలని, జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సూచనలు పాటించాలని, “డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యమే ప్రధాన ఆయుధం” అని నగరపాలక సంస్థ కమిషనర్ విజయవాడ తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి డెంగ్యూ నిర్మూలనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె. షమ్మీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ (ఇంచార్జ్)పి. సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ నాయక్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, వన్ ఎర్త్ వన్ లైఫ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *