Breaking News

“ఆపరేషన్ క్లీన్ స్వీప్‌కు శ్రీకారం – నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరం”

-“మంగళగిరి–తాడేపల్లిలో భారీ పారిశుద్ధ్య డ్రైవ్ – ప్రజలందరూ భాగస్వాములు కావాలి”
-“స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం”

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని 2026 మే 23వ తేదీ నుండి జూన్ 19వ తేదీ వరకు విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎస్. అలీం బాషా తెలిపారు. నగర పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడం, పారిశుద్ధ్య మౌలిక వసతులను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులు, ప్రజా ప్రదేశాలు, రెడ్ స్పాట్లు, యెల్లో స్పాట్ల వద్ద ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టబడతాయి. అలాగే కాలువల శుభ్రపరచడం, చెత్త తొలగింపు, డ్రైన్ల డీ-సిల్టింగ్, ఇంటింటికీ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించబడుతుందని. రేపు అనగా తొలిరోజు 23.05.2026 ఉదయం తెనాలి రోడ్‌లో బిస్మిల్లా హోటల్ నుండి ఎన్‌హెచ్-16, సీఎన్‌ఆర్ హ్యాండ్‌లూమ్స్ మీదుగా రాజీవ్ సెంటర్ వరకు రెడ్ స్పాట్లు, యెల్లో స్పాట్ల వద్ద ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టబడతాయి. అలాగే కాలువల శుభ్రపరచడం, చెత్త తొలగింపు, డ్రైన్ల డీ-సిల్టింగ్ వంటి ప్రత్యెక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

25-05-2026:

మంగళగిరి గౌతమ బుద్ధా రోడ్‌లో ఎయిమ్స్ ఫ్లైఓవర్ నుండి ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ (నేతన్న సర్కిల్) వరకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపడతారు.

26-05-2026:
తాడేపల్లి లో ఉండవల్లి సెంటర్ నుండి ఎయిమ్స్ ఫ్లైఓవర్ వరకు భారీ క్లీన్లీనెస్ డ్రైవ్ నిర్వహించబడుతుంది.

27-05-2026:

తెనాలి ఫ్లైఓవర్ నుండి డీజీపీ ఆఫీస్ వరకు ఇరువైపులా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడుతుంది.

ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ ఎస్. అలీం బాషా మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. ప్రజలందరూ ఇంటింటికీ చెత్త వేరు చేసి ఇవ్వడం, రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నగర పాలక సంస్థ వారికి సహకరించడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

అలాగే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛ మంగళగిరి సాకారం చేసే దిశగా సహకరించాలని ఆయన తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *