Breaking News

గుంటూరు నగరంలో నాలుగు వారాల ప్రత్యేక కార్యాచరణ: ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా గుంటూరు నగరాన్నిపరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతొ నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణను ఈ నెల 23వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా మొదటి వారం రోజుల్లో నగరంలోని ‘రెడ్ స్పాట్లు’ (ఎక్కువగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) మరియు ‘ఎల్లో స్పాట్లు’ను ప్రత్యేకంగా గుర్తించి, వాటిని పూర్తి స్థాయిలో క్లియర్ చేసి పరిశుభ్రంగా మారుస్తామని తెలిపారు. ఆ తర్వాత రెండవ వారంలో నగరంలోని వరద నీటి కాలువలు, ప్రధాన కాలువలు మరియు ఉప కాలువల్లో పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను తొలగించేందుకు ఉధృతంగా పనులు చేపడతామని వివరించారు. మూడవ వారంలో నివాస ప్రాంతాలు మరియు వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ పేరుకుపోయే చెత్తను పూర్తి స్థాయిలో తొలగించి పరిసరాల స్వచ్ఛతను కాపాడుతామన్నారు. ఇక చివరిదైన నాల్గవ వారంలో నగరంలోని బహిరంగ మరుగుదొడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ముఖ్యమైన సామూహిక ప్రాంతాలలో విస్తృతంగా పారిశుధ్య చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. గుంటూరు నగర ప్రజల ఆరోగ్యం, నగర సుందరీకరణే ధ్యేయంగా ఈ ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ నిర్వహిస్తున్నామని, ప్రతీ రోజు ప్రణాళికాబద్ధంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా ప్రత్యేక బృందాలను కేటాయించామన్నారు. నగర ప్రజలు కూడా తమ ఇళ్లను, వ్యాపార సంస్థలను శుభ్రంగా ఉంచుకుంటూ, చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా ప్రజారోగ్య కార్మికులకే అందించి ఈ స్వచ్ఛ భారత్ స్ఫూర్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *