Breaking News

సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కార్యాచరణ రూపొందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ఏకతాటి పైకి తీసుకు వచ్చె విధంగా కార్యాచరణ రూపొందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారుకు తెలిపారు. శుక్రవారం గుంటూరు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో గుంటూరు అర్బన్ లైవ్లీ హుడ్ ట్రాన్స్ఫర్మేషన్ మిషన్ (జియుఎల్టీఎం) ప్రతినిధులు, మెప్మా, డి.ఆర్.డి.ఎ, జిల్లా పరిశ్రమల కేంద్రం, లీడ్ బ్యాంకు అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సి అధికారులు ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
సదరు సమావేశంలో తొలుత గుంటూరు నగరంలో ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా యస్.హెచ్.జి బృందాలకు అందజేసిన బ్యాంకు ఋణాలు, ముద్రా లోన్లు, పీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి వివరాలను బ్యాంకు ప్రతినిధులను సంబంధిత కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పేదలకు స్ట్రీట్ వెండర్స్ కు చేతివృత్తుల వారికి ఎస్.హెచ్.జి గ్రూప్ ల వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నపేద ప్రజలకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నపీఎం విశ్వకర్మ, పీఎం స్వానిధి, ముద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఒక వేదిక పైకి తీసుకువచ్చి, వివిధ కేటగిరీల వారీగా ప్రజలను గుర్తించి వారందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయుట జరిగిందన్నారు. భవిష్యత్ లో గుంటూరు నగరంలో చేపట్టబోయే కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేసినట్లైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల అధికారు లతో మాట్లాడి నిధులు మంజూరు అయ్యే విధంగా కృషి చేస్తామని ఓఎస్డి రామకృష్ణ నాయుడు తెలిపారు. ఈ మిషన్ ను జిల్లా కలెక్టర్ హెడ్ గా నగరపాలక సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్ అధికారులు, మెప్మా అధికారులు, ఎంఎస్ఎమ్ఈ అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, ఏపీ స్టేట్ లైవ్లీ హుడ్ మిషన్ రిప్రెసెంటేటివ్స్, యస్.హెచ్.జి ఫెడరేషన్, ఇండస్ట్రీస్ ప్రతినిధులు, స్ట్రీట్ వెండర్స్ ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి నూతనంగా టైమ్ లైన్ ఏర్పాటు చేసుకొని దశలవారీగా గుంటూరు నగరంలో ఈ పథకాలను అమలు చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు.
సమావేశంలో పిఎస్ ఏపీ సింగ్, ఓఎస్డి రామకృష్ణ నాయుడు,లీడ్ బ్యాంకు మేనేజర్ మహీధర్ రెడ్డి, మెప్మా, డి.ఆర్.డి.ఏ పి.డి విజయలక్ష్మి,ఎంఎస్ఎమ్ఈ అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు, ఇండస్ట్రీస్ ప్రతినిధులు, జిఎంసి పిఓ సింహాచలం, మెప్మా సి.యం.యంలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *