Breaking News

కృష్ణపట్నం-ఓబులవారిపల్లి రైల్వే లైను నిర్వహణ కోసం కెఆర్‌సిఎల్‌ మరియు దక్షిణ మధ్య రైల్వే మధ్య కుదిరిన ఒప్పందం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణపట్నం-ఓబులవారిపల్లి మధ్య 119 కి.మీల నూతన రైల్వే లైను నిర్వహణ కోసం దక్షిణ మధ్య రైల్వే మరియు కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్‌ (కెఆర్‌సిఎల్‌) వారి మధ్య ఒప్పందం కుదిరింది. తదనుగుణంగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సమక్షంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ జి.జాన్‌ ప్రసాద్‌ మరియు కెఆర్‌సిఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  కె.శివ ప్రసాద్‌ చే సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో నేడు అనగా 8 నవంబర్‌, 2021 తేదీన ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌  ఆర్‌.ధనంజయులు మరియు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (సరుకు రవాణా) డా। బి.ఎస్‌. క్రిస్టోఫర్‌ కూడా పాల్గొన్నారు.
విజయవాడ-గూడూరు మధ్య గ్రాండ్‌ ట్రంక్‌ రద్దీ రైల్వే లైను ప్రయాణికుల, సరుకు రవాణా రాకపోకలలో అత్యంత కీలకమైన రైల్వే లైను. దేశంలో ముంబాయి వంటి పశ్చిమ తీర ప్రాంతాలకు కృష్ణపట్నం పోర్టు నుండి సరుకు రవాణా రాకపోకలు గతంలో గూడూరు, రేణిగుంట మీదుగా నిర్వహించేవారు. సరుకు రవాణా రైళ్ల రాకపోకలు భారీ స్థాయిలో ఉన్న కారణంగా, సెక్షన్‌లో రద్దీ అధికమయ్యింది. ఈ సమస్యలను అధిగమించడానికి మరియు కృష్ణపట్నం పోర్టు నుండి లోడిరగ్‌ మెరుగుదలకు కృష్ణపట్నం పోర్టు- ఓబులవారిపల్లి మధ్య నూతన రైల్వే లైను ప్రాజెక్టు మంజూరు చేయబడిరది. ఈ ప్రాజెక్టు రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌విఎన్‌ఎల్‌), కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌ (కెపిసిఎల్‌) (ఇది ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్టు లిమెటెడ్‌`ఎకెపిఎల్‌ అని పిలువబడుతుంది), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, సాగర్‌ మాలా డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌డిసిఎల్‌), నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎమ్‌డిసి) మరియు బ్రాహ్మణి స్టీల్స్‌ సంస్థలు కలిసి ఏర్పడిన స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పివి) ద్వారా కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్‌ (కెఆర్‌సిఎల్‌) ఈ ప్రాజెక్టు పనులను చేపట్టింది.
మొత్తం రైల్వే లైను విజయవంతంగా పూర్తి చేయబడి, విద్యుదీకరించిన 6.6 కిమీల పొడవైన సొరంగంతో సహా ఓబులవారిపల్లి-వెంకటాచలం మధ్య చివరి దశ పనులు జులై 2019లో పూర్తయ్యి ప్రారంభించబడిరది. కృష్ణపట్నం పోర్టు – వెంకటాచలం – ఓబులవారిపల్లి నూతన రైల్వే లైను ప్రాజెక్టు రెండు ప్రధాన రైల్వే మార్గాన్ని అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో గుంతకల్‌ డివిజన్‌ నుండి కృష్ణపట్నంకు వచ్చే రైలు మార్గంలో 72 కి.మీ దూరం తగ్గుతుంది మరియు ఓబులవారిపల్లి – రేణిగుంట – గూడూరు సెక్షన్‌లో రద్దీని తగ్గిస్తుంది. నూతన రైల్వే లైను సెక్షన్‌లో రద్దీని తగ్గించడంతో పాటు రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటక మరియు పశ్చిమ తీరం ప్రాంతంలోని జిల్లాలకు సరుకు రవాణా సజావుగా సాగించడానికి తోడ్పడుతుంది. వెనుకబడిన ప్రాంతాల సామాజిక`ఆర్థికాభివృద్ధికి కూడా నూతన రైల్వే లైను తోడ్పడుతుంది. కృష్ణపట్నం రైల్వే స్టేషన్‌ నుండి ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్‌ వరకు అనుసంధానిస్తూ మొత్తం 119 కి.మీల పొడవు రైల్వే లైను నిర్వహణకు సంబంధించి ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.
కెఆర్‌సిఎల్‌తో ఒప్పందం కుదుర్చుకొని పత్రాలపై సంతకాలు చేయడంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌  గజానన్‌ మాల్య సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం-ఓబులవారిపల్లి మధ్య నూతన రైల్వే లైను నిర్వహణపై ఒప్పందం కుదరడంతో కృష్ణపట్నం పోర్టు నుండి సరుకు రవాణా అభివృద్ధికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని మరియు విజయవాడ – గూడూరు ప్రధాన లైనులో రాకపోకలు సజావుగా సాగడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *