విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్య ఖర్ఆన్ పటిష్ట సంబంధం ద్వారానే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురనిక్ స్టడీస్ చైర్మన్ మొహమ్మద్ దావూద్ పేర్కొన్నారు. గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో దావూద్ మాట్లాడుతూ నేడు చెడు అన్నది చాలా సునాయాసంగా అతివేగంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు. మానవ జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లో దాని ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. మనం నిత్యం ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలు సమస్యలన్నిటికీ మూల కారణం అనైతికత, అవినీతి మాత్రమేనని చెప్పారు. నేడు చిన్నతనంలోనే పిల్లలు అనైతిక అలవాట్లకు బానిసలు అవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వీటన్నిటికీ కారణం ఇంటర్నెట్లోని అశ్లీల సినిమాలు, యూట్యూబ్, మొబైల్ గేమ్స్ లకు అతుక్కుపోయి అతి విలువలు గల కాలాన్ని వృధా చేయటంతో పాటు పెద్దల పట్ల గౌరవం లేని విధంగా ఉంటున్నారని వివరించారు. ఈ రోజులలో పిల్లలకు పెద్దల పట్ల గౌరవం, నైతిక విలువలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారిని దివ్య గ్రంథాలకు దగ్గర చేసి పెద్దల పట్ల గౌరవం సమాజం పట్ల బాధ్యతలు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దావూద్ అభిప్రాయపడ్డారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఫోరం ఫర్ క్యూరానిక్ స్టడీస్ బాలబాలికల కొరకు దివ్య ఖురాన్ ప్రతిభ పోటీలు నిర్వహిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి మూడు నుండి 12 సంవత్సరాల వయసులోపు గల బాలబాలికలు చాలామంది దివ్య ఖురాన్ కంటస్థ పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. నగరంలో ని ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ హాల్ నందు ఆదివారం నాడు ఫైనల్స్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ పోటీల్లో విజేత అయిన వారికి మొదటి బహుమతిగా 20 వేలు, బహుమతిగా 15 వేలు, మూడో బహుమతిగా 10 వేలు అందజేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ ఉమ్రి, అబ్దుల్ బాజాన్, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News