Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో సమన్యాయం… నినాదంతో కొత్తపార్టీ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రముఖ బి.సి నాయకులు, బి.సి సంఘనాయకులు బి.సి ధృక్పదం కలిగిన రాజకీయ పార్టీ నాయకుల సమావేశము ప్రముఖ బి.సి నాయకులు అన్నారామచంద్రయాదవ్ అధ్యక్షతన నగరం లోని మురళి ఫార్చ్యూన్ హోటల్ శుక్రవారం జరిగినది. ఈ సమావేశములో ప్రముఖ బి.సి నాయకులు అన్నా రామచంద్రయాదవ్, వి.జి.ఆర్ నారగోని మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు సంబంధించి 139 కులాలు ఉంటే వారిలో కేవలం 10 నుండి 15 కులాలకు సంబంధించిన వారు మాత్రమే రాజకీయాల్లో నాయకులుగా ఉన్నారని తెలిపారు. మిగిలిన కులాలకు కనీసం ఇప్పటివరకు అవకాశం రాలేదని నిరాశ వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో టి.డి.పి, వై.యస్.ఆర్.సిపి లాంటి పార్టీలు బి.సిల బడుగు బలహీన వర్గాల ఆశయాలను, ఆకాంక్షలను నేరవేర్చడంలో రాజ్యాధికారములో భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అభిప్రాయ పడ్డారు. కేవలం రెండు అగ్రకులాల, రెండు వర్గాల పరిపాలనగా మార్చివేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాయటమేనని పేర్కొన్నారు. బి.సిలకు కేవలం బర్రె, గొర్రె, ఇళ్ళ స్థలాలు, సంక్షేమ కార్యక్రమాలకే పరిమితం కాబడ్డాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాజకీయ అధికారం కేవలం రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య జరిగే తంతుగా మారిందని, రాజ్యాధికారాన్ని బి.సి లకు, బడుగు బలహీనవర్గాలకు మార్పిడి దిశగా రాజకీయ మార్పు జరగాల్సిన సమయం అసన్నమైందని తెలియజేశారు. బి.సిల నాయకత్వంలో ఎస్.సి, ఎస్.టి, ముస్లిం, క్రిస్టియన్లు కలియికతో క్రొత్త రాజకీయ పార్టీ స్థాపించాలని సమావేశము ఏకగ్రీవంగా నిర్ణయించినది. ఒకే జెండా, ఒకే పార్టీగా ఒకే నాయకత్వంగా రూపొందించడం జరిగితే బాగుంటుందని మేజార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సమన్యాయం అనే నినాదంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల బరీలోకి దిగాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ జెండా, పేరు, విధివిధానాలను రూపొందించడానికి సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగినదని, త్వరలో పార్టీ కేంద్రకార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సుమారు 150 మంది నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే రాజకీయ పార్టీపై సుదీర్ఘంగా చర్చించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నా రామచంద్రయ్య, విజి.వి.ఆర్. నారగోని, పాలూరి రామకృష్ణయ్య, ఆకురాతి మురళీకృష్ణ, ఆలా వీరు, పి.వి రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *