Breaking News

ఉపాద్యాయులే సమాజ నిర్మాతలు, లెసన్ ప్లాన్ విధానంతో భోదన జరగాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మంచి సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని , విద్యార్థులను పట్టించుకోకపోతే జీవితంలో వారు పైకి రారని గుర్తించాలని, వారికి విద్యలో కాన్ఫిడెన్స్ నింపాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ నందు జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో ప్రధానోపాధ్యాయులతో, కళాశాలల ప్రిన్సిపల్ తో, జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విధ్యార్దే అని , ఏ వృత్తిలో లేని గౌరవం ఉపాధ్యాయులకు దక్కుతుందని అన్నారు. నేను టీచర్ గా పనిచేసి ఆ తరువాత , పలు ఉద్యోగాలు చేసి ఐ. ఎ .ఎస్. గా జిల్లా కలెక్టర్ అయ్యానని అన్నారు. ప్రపంచంలో అత్యధిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరుణంలో విద్యాశాఖలో పలుమార్పులు రావడం, యాప్ లు రావడం జరిగిందని సాకేంతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని అన్నారు. విద్యా బోధన అనేది ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్ అనుసరించి మనస్ఫూర్తిగా బోధించగలిగితే విద్యార్థులు మిమ్ములను గుర్తుపెట్టుకుంటారని, ఎక్కడ కనిపించినా గౌరవం ఇస్తారని ఇది ఎవరికీ దక్కదని అన్నారు. అందులో డల్ స్టూడెంట్ లను చేరదీసి అర్థమయ్యేలా ఒకటికి రెండు సార్లు చెప్పగలిగితే, వారు ఉత్తీర్ణత సాధించగలిగితే మీకు జీవితాంతం మరింత గౌరవం ఇస్తారనేది నిజం అన్నారు. గత సంవత్సరం తిరుపతి జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణత 58% మాత్రమేనని ఈ ఏడాది 100% వచ్చేలా విద్యార్థులను ప్రణాళిక బద్ధంగా తీర్చిదిద్దాలని, డల్ విద్యార్ధి కూడా మీబోధన తో నేను కాపీ కొట్టకుండా పాస్ అవుతాననే భావన రావాలని సూచించారు. తెలివి తక్కువ విద్యార్థులను మోటివేట్ చేయగలిగితే వారు పాస్ కాగల అవకాశం ఉంటుందని, అందుకే లెసన్ ప్లాన్ అన్నది మనం అనుసరించాల్సి ఉంటుందని అనుకున్న ఉత్తీర్ణత సాధించగలమని అన్నారు. సి. డి. కేటగిరి విద్యార్థులకు మరో గంట పాటు విద్యా బోధన ఇవ్వగలగాలని అది కూడా వారికి అర్థమయ్యే రీతిలో, వారిలో మేము చదువు కుంటామనే భావన కలిగేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించిన ఎనిమిదో తరగతి విద్యార్థులకు బై-జుస్ టాబ్ ల వినియోగం పూర్తిస్థాయిలో రావాలని, ఇందులో ఉపాధ్యాయులు కూడా పూర్తిగా ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోగలిగితే తొమ్మిది, పది తరగతుల బోధన సులభతరం అవుతుందని అన్నారు. స్పోకన్ ఇంగ్లీష్ పై దృష్టి పెట్టి రోజుకొక పదం, ఒక చిన్న స్కిట్ వారివద్ద చేయగలిగితే కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయని అన్నారు. ఎక్కునగా కమ్యునికేషన్ స్కిల్స్ లేకనే గ్రామీణ విద్యార్థులు అనుకున్న గోల్ సాధించలేక పోతున్నారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు మనంఏమాత్రం తీసిపోమని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో పరీక్షలు రాసి, ఎంతో అనుభవంతో వచ్చిన వారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో బట్టి విద్యా బోధన వల్ల కొంతమంది మొదటి ర్యాంకులు సాధిస్తే, మరి కొంతమంది పూర్తిగా వెనకబడి ఉంటారని అలా కాకూడదని ప్రతిదీ అర్థమయ్యేలా మనం పిల్లలకు దగ్గరగా ఉండి బోధన చేయగలగాలని సూచించారు. పోషకాహార లోపంగల పిల్లల కోసం ప్రత్యేక దృష్టి పెట్టి మనం ప్రస్తుతం ఇస్తున్న గోరుముద్దతో పాటు వారికి అదనంగా దాతల సాయంతో వైద్య సిబ్బంది సూచనల మేరకు మన పిల్లలనే భావనతో అందించగలగాలని , అవసరమైతే నన్ను సంప్రదించాలని అన్నారు. పౌష్టికాహార లోపం పిల్లలు మనం చెప్పే పాఠాలను శక్తి లేనందున వినలేరని అందువల్లే వెనుకబడతారని అన్నారు. తన పర్యటనలో వెంకటగిరి బి సి రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న 640 మంది విద్యార్థులు పౌష్టికాహార లోపాలు ఉన్నవారని గుర్తించిన ప్రిన్సిపల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్థానికంగా సంప్రదించి అదనపు పౌష్టికాహారం గుడ్డు, చిక్కిలు అందించడంతో నేడు పూర్తిగా పౌష్టికాహార లోపం నుండి కేవలం 45 రోజులలో బయటపడ్డారని ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తున్నానని అన్నారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు కూడా బై జ్యుస్ ట్యాబ్ లను అందించాలని డి.ఈ.ఓ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఇ ఓ శేఖర్, డిల్లీ పబ్లిక్ స్కూల్ ఎ ఓ , జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉప విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపల్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *