డూప్లికేట్ ఓటర్ల గుర్తింపు పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటర్లలో ఎ ఒక్క డూప్లికేట్ ఓటరు ఉండరాదని ప్రత్యేకంగా పరిశీలించి వారి తొలగింపు వివరాలు, పేర్లు మరోచోట ఓటు వున్న వివరాలు పూర్తిస్థాయిలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ , డి ఆర్ ఓ శ్రీనిస రావు, అడిషనల్ ఎస్ పి వెంకటరావు , ఇ ఆర్ ఓ , ఎ ఇ ఆర్ ఓ ల, ఎస్ హెచ్ ఓ తో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి పలుసూచనలు చేసారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ మండల పరిధిలో, మునిసిపల్ పరిధిలో ప్రస్తుత్తం వున్న ప్లేక్సీల తొలగింపు, తొలగించిన వివరాలు ప్రోఫార్మలో నింపాలని అన్నారు. ప్రతి మండల స్థాయిలో తహసిల్దార్లు రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశమై, పోలింగ్ కేంద్రాల వివరాలు , అనుసరించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి తెలియజేసి రిపోర్ట్ పంపాలని అన్నారు. డూప్లికేట్ ఓటర్లు తొలగింపు , ఈ నెల 10వరకు అందే క్లైములు పరిశీలన చేయాలని అన్నారు. ఈ ఆర్ ఓ లు అనుసంధాన ( ఆక్సిలరి) పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చూడాలని అన్నారు. మండల స్థాయిలో , నియోజక వర్గ స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి అన్నారు. తప్పని సరి పోలింగ్ కేంద్రాలు మరోసారి పరిశీలించాలని, మార్పు లు వుంటే ఎన్నికల కమిషన్ కు పంపాల్సి ఉంటుందని సూచించారు. అడిషనల్ ఎస్ పి వెంకటరావు మాట్లాడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎం.సి.సి. టీమ్ లను అనుసరించాలని, ర్యాలీలు నిర్వహిస్తే ప్రచార పర్మిషన్ ఉండేలా చూడాలని, ప్రతిరోజూ ఉల్లంఘన వివరాలు ప్రోఫార్మా లో నింపి పంపాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ఉండేలా చూడాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *