గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో కార్మికులకు అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ కార్మికురాలు భర్తకు ఎక్స్ గ్రేషియా చెక్ ని సోమవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహించే బత్తుల సుగుణ ఇటీవల కాలంలో మరణించారని, తన భర్త రవిచంద్ర కు ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల చెక్ ని అందించామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగ సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు.
Tags guntur
Check Also
ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోవడం రాజకీయ పతనానికి నిదర్శనం
-16 వేలకుపైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన లోకేష్‌ను చూసి ఓర్వలేక విషప్రచారం -ఐదేళ్లలో డీఎస్సీ ఇవ్వలేని జగన్.. ఇప్పుడు …
Prajavartha Online Telugu News