గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతన బహుళ అంతస్తు నిర్మాణాలకు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్.టి.పి.)లు తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలతోనే డి.పి.ఎం.ఎస్.లో అప్ లోడ్ చేయాలని, లేకుంటే తగు చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు ఇన్నర్ రింగ్ రోడ్, వికాస్ నగర్, శ్యామల నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్.ఓ.సి.కి దరఖాస్తు చేసుకున్నభవనాలను లేజర్ మెజరింగ్ మెషిన్ ద్వారా కొలతలు పరిశీలించి పట్టణ ప్రణాళిక అధికారులకు తదుపరి అనుమతులపై తగు ఆదేశాలు జారి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎల్.టి.పి.లు నూతనంగా బహుళ అంతస్తు భవనాలకు అనుమతుల కోసం ఆన్ లైన్ ద్వారా డి.పి.ఎం.ఎస్.లో తప్పనిసరిగా నిర్దేశిత ధ్రువ పత్రాలు, నిబందనలకు అనుగుణంగా దరఖాస్తు చేయాలని, లేకుంటే తదుపరి అనుమతుల జారీ నిలిపివేయడం జరుగుతుందన్నారు. కనుక భవన నిర్మాణదారులు కూడా ఎల్.టి.పి.లను నిబందనలకు అనుగుణంగానే దరఖాస్తు చేయాలని తెలియచేయాలన్నారు. నిబందనలకు విరుద్ధంగా అప్ లోడ్ చేసే ఎల్.టి.పి.ల లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ ఎలైన్మెంట్ కాని, లేదా మాస్టర్ ప్లాన్ లో చేసిన భవన నిర్మాణాలకు ఆక్యుపెన్సీ అనుమతులు ఇవ్వబడవన్నారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని, లేని వాటి పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాలిక అధికారులను ఆదేశించారు. సెట్ బ్యాక్ పోర్షన్ లో, రోడ్ వైడినింగ్ పోర్షన్ లో ఎటువంటి నిర్మాణం చేసినా, నిర్ణీత ఎత్తు మించినా కూడా ఆక్యుపెన్సీ ఇవ్వడం జరగదన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్ట్ పిట్ లు నామమాత్రం కాకుండా పక్కాగా పని చేసేలా కనెక్షన్ చేయాలని, సచివాలయ కార్యదర్శులు పక్కగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం గ్రీనరికి కేటాయింపు ఉండాలన్నారు. పర్యటనలో సిటి ప్లానర్ మూర్తి, ఏ.సి.పి.లు అజయ్ కుమార్, బాబురావు, టి.పి.ఎస్.లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News