Breaking News

కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థలో కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని, కార్మికులకు అందాల్సిన పరిహారాలు వెంటనే అందిచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నగర నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజారోగ్య విభాగ కార్మికురాలు కుమార్తెకు ఎక్స్ గ్రేషియా చెక్ ని బుధవారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు నగరపాలక సంస్థ అండగా ఉంటుందన్నారు. ప్రజారోగ్య విభాగంలో అవుట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహించే కర్రా మరియమ్మ ఇటీవల కాలంలో మరణించారని, ఎక్స్ గ్రేషియా రూ.2 లక్షల చెక్ ని మరియమ్మ కుమార్తె ప్రసన్నకుమారికి అందించామని తెలిపారు. అలాగే నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత విభాగ సూపరిండెంట్లను ఆదేశించామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంత్ రవిదాస్ కలశ యాత్రతో సామాజిక ఏకత్వానికి పిలుపు

-కుల, మత భేదాలను వీడి సమానత్వం వైపు సాగాలి: పీవీఎన్ మాధవ్ -వారణాసి నుంచి వచ్చిన పవిత్ర కలశాలకు విజయవాడలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *