Breaking News

ప్రైవేటు బడుల్లో ఉచిత విద్యకు 3023 మంది విద్యార్థుల ఎంపిక

-లాటరీ పద్ధతిలో రెండో జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ 
-ఈ నెల 9వ తేదీలోపు విద్యార్థులను బడుల్లో చేర్పించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత విద్యాహక్కు చట్టం కింద మొదటి విడతలో భాగంగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించిన విద్యార్థుల రెండో జాబితా బుధవారం విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో మొదటి లాటరీలో మిగిలిన సీట్లను భర్తీ చేస్తూ రెండో జాబితా చేయగా 3023 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. ఆ జాబితాను అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు పంపించామని పేర్కొన్నారు. విద్యార్థులకు కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 3 వ తేదీ నుండి ఈ నెల 9వ తేదీ లోపు చేర్పించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *