Breaking News

ఈ నెల 8 నుండి రాష్ట్రంలోని పౌర గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా పౌర గ్రంథాలయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో అన్ని పౌర గ్రంథాలయములలో ది.08-05-2022 నుండి 11-06-2022 వరకు 10 నుండి 15 సంవత్సరముల వయస్సు గల విద్యార్ధినీ విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం 8-00 గంటలనుండి 12-00 గంటల వరకు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమమునకు సంబంధించిన broacher మరియు poster లను గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ శ్రీ మందపాటి శేషగిరి రావు గారు, ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్న కుమార్ గారు ఆవిష్కరించినారు. గతం లో వేసవి శిక్షణా శిభిరాలు నిర్వహణ స్పూర్తితో ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయాల శాఖ వారు విద్యార్థుల్లో గ్రంథాలయాలపై అవగాహన తీసుకురావాలనే ఉద్దేశముతో ఈ నెల 08 వ తేదీ నుండి జూన్ 11 వ తేదీ వరకు పాఠశాలలో ఉండే పిల్లలకు వేసవి శిక్షణా శిభిరాలు 2023 నిర్వహించటానికి ప్రణాళికను సిద్దం చేయటం జరిగినది. విద్యార్థులు వేసవి సెలవులను సక్రమముగా వినియోగించుకొని వారికి ఆసక్తి గల రంగాలలో అభివృద్ది సాధించటానికి స్థానికముగా ఉన్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థలు వారి సహకారముతో వివిధ కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రణాళికను సిద్ధం చేయటం జరిగినది. ఆసక్తి గల తల్లిదండ్రుల అంగీకారముతో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమములో పాల్గొనవలెను.
వేసవి శిక్షణా శిబిరాల నిర్వాహణ సమయం: ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం12.00 గంటల వరకు.
ఉ.గం.8.00 నుండి గం.8.30 వరకు : కథలు వినడం.
ఉ.గం.8.30 నుండి గం.10.00 గంటలవరకు : గ్రంథాలయములో గల పుస్తకాలు చదవడం.
ఉ.గం.10.00 నుండి గం.10.10 వరకు విరామము.
ఉ.గం.10.10 నుండి గం.10.30 వరకు : చదివిన పుస్తకం పై పుస్తక సమీక్ష.
ఉ.గం.10.30 నుండి గం.11.00 వరకు :కథలు చెప్పటం (చదవటం మాకిష్టం)
ఉ.గం.11.00 నుండి గం.12.00 వరకు :స్పోకెన్ ఇంగ్లిష్/డ్రాయింగ్/పెయింటింగ్/పేపర్ క్రాఫ్ట్/డాన్స్/అతిథుల ప్రసంగాలు/డ్రామా/బొమ్మలు చేయటం మరియు ఇతర అంశములు నేర్పించుట.
ఈ కార్యక్రమము లో విద్యార్థిని,విద్యార్థులు అందరూ పాల్గొని గ్రంథాలయాల పై అవగాహనను పెంచుకొని వారిలో పఠనాశక్తి ని పెంపొందించుకోవాలి అని మరియు ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలియజేయటం జరిగినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *