Breaking News

పెన్షనర్లు, ఉద్యోగస్తులు ఈకేవైసీ మే10 లోపు అప్డేట్ చేసుకోవాలి: జిల్లా ఖాజానా అధికారి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఉత్తర్వ్యులు G.O.Ms.No.7 Finance Budget-11. Department తేదీ 11.01.2023 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ విధిగా తమ తమ CFMS. ID లను వారి యొక్క ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయవలసి యున్నది. CFMS ID మరియు HERB PAY ROLL కు సంబంధించిన సేవలను పొందాలంటే ఈ అనుసంధానము అత్యవసరము. తదనుగుణంగా ఉద్యోగుల యొక్క CFMS ID లను ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయుట జరిగింది. కానీ పెన్షనర్ల CFMS.ID ల అనుసంధానము ఇంకా పూర్తి చేయవలసి యున్నదనీ, ఈ ప్రక్రియ మొత్తము ఈ మే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా ఖజానా మరియు లెక్కల శాఖ అధికారి లక్ష్మీ కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున పెన్షనర్ల సౌలభ్యం కొరకు వారి e-KYC పూర్తి చేయుటకు గాను సంబంధిత ఉప ఖజానా కార్యాలయ సిబ్బంది తిరుపతి మరియు ఇతర ఉప-ఖజానా అధికారులు ఉప-ఖజానా కార్యాలయ పరిధిలో అందుబాటులో వుంటారనీ, తద్వారా ఆయా ఉప ఖజానా పరిధిలోని పెన్షనర్లు ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి e-KYC పూర్తి చేయించుకోవలసినదిగా కోరడమైనది. పెన్షనర్లు వారి వెంట ఆధార్ కార్డు మరియు ఆధార్ అనుసంధానిత చరవాణి తెచ్చుకోవలసినదిగా వారు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *