Breaking News

గ్రంథాలయ సంస్థ వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: చైర్మన్ మధుబాల

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక అన్నమయ్య సర్కిల్ నందు (ఆల్ ఇండియా రేడియో వెనకాల) వున్న ప్రభుత్వ గ్రేడ్ -1 శాఖా గ్రంథాలయం తిరుపతి, బాలల గ్రంధాలయం, ఎమ్మార్ పల్లి లతో కలిపి చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని 69 గ్రంథాలయాల్లో శిబిరాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి నైనార్ మధుబాల గారి ఆధ్వర్యంలో నందు 08-05-2023 నుండి 16-06-2023 వరకు ఉదయం 8.00 నుండి 12.00 వరకు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.

6 నుండి 10వ తరగతులలో చదువుచున్న విద్యార్థులకు యోగ, మెడిటేషన్, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రామా,నాటికలు, ఇంగ్లిష్ గ్రామర్, చెస్, క్యారమ్స్ , సంగీతం మరియు ఇతర అంశాలపై ఉచితముగా శిక్షణ ఇప్పించి ప్రతివారం విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని, అలాగే పిల్లలు గ్రంధాలయాలకు వచ్చేలా, పిల్లలలో పుస్తక పఠనంతొపాటు విజ్ఞానాన్ని పెంపొందించుకునేలా మరియు వారిలో సృజనాత్మకతను పెంచే కృషిలో భాగంగా ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం వారు వారి పిల్లలను ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొనేల ప్రోత్శహించవలసినదిగా కోరారు. కావున తిరుపతి పట్టణం నందలి 6 నుండి 10వ తరగతిలలో చదువుచున్న, ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనుటకు ఆసక్తి వున్న విద్యార్థిని, విద్యార్థులు ఎవరైనా గ్రందాలయాధికారి ఫోన్ నెంబర్ -9912189869కి ఫోన్ ద్వారా (లేదా) శాఖా గ్రంధాలయం, తిరుపతికి వచ్చి వారి పేర్లను నమోదు చేసుకోవలసినదిగా తెలిపారు. ఈ ఉచిత వేసవి శిక్షణ శిబిరంలొ పై తెలిపిన అంశాలలొ శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల టీచర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, రచయితలు, కవులు, స్వచ్చంద సంస్థలు ఇంకనూ ఎవరైనా ఉచితముగా శిక్షణ ఇచ్చే వారు (రిసోర్స్ పర్సన్స్) గ్రంధాలయాధికారికి ఫోన్ ద్వారా వారి వివరములు తెలుపవలసినదిగా తెలియ చేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *