-సర్వే సమయంలో క్యాన్సర్ లక్షణాల కలవారు ఏ ఒక్కరు తప్పిపోకుండా చికిత్స అందించాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 691 సచివాలయాల పరిధిలోని మహిళా ఎ.ఎన్.ఎం , ఎం.ఎల్.హెచ్.పి.లకు క్యాన్సర్ లక్షణాల గుర్తింపుపై ఈ నెల 10 నుండి కనీసం 50 మందికి తక్కువలేకుండా పై శిక్షణ, ప్రాక్టికల్ వంటివి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కాన్సర్ కమిటీ సభ్యులయిన డాక్టర్లు, స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న కాన్సర్ స్క్రీనింగ్ విధానం పగద్బందీగా అమలు చేయాలని, ఈ విధానంలో 30 సం.పైబడిన మహిళలకు మొదటి ప్రాధాన్యతగా చికిత్సలు అందించాలని నిర్ణయించామని, ప్రతి సచివాలయ పరిదిలో గల మహిళల ఎం.ఎల్.హెచ్.పి. లకు ఎ.ఎన్.ఎం. లకు ఒకరోజు స్వరే విధానం , మరో రెండురోజులు ఆసుపత్రిలలో కాన్సర్ గుర్తింపు పై చికిత్స పొందుతున్న పేషెంట్ల పరిశీలన వంటివి పూర్తిచేసి త్వరగా ఆయా సచివాలయ పరిధిలో యాప్ సర్వే ప్రారంభించాలని , సర్వేలో లక్షణాలు వుంటే పింక్ బస్సుకు అనుసంధానం అవుతుందని , పింక్ బస్ పర్యటన సందర్భంగా వైద్య పరీక్షలు, చికిత్స ప్రారంభం అవుతుందని అన్నారు. సివియర్ కేసులు వెంటనే ఆసుపత్రికి పంపే విధంగా ఏర్పాటు జరగాలని సూచించారు. పింక్ బస్ పర్యటన షెడ్యుల్ సచివాలయ వాలింటర్లు రెండు మూడు రోజుల ముందుగానే అవగాహన కల్పించాలని లక్షణాలు కలిగిన ఎ ఒక్కరు చికిత్సకు దూరం కారాదని అన్నారు. ట్రైనింగ్ మెటీరియల్ , యాప్ లు సిద్దం కావాలని అన్నారు. ఈ సమీక్షలో కమిటీ మెంబర్ కన్వినియర్ డి ఎం హెచ్ ఓ శ్రీహరి, స్విమ్స్ డా.జయచంద్రా రెడ్డి, ఎస్ వి మెడికల్ కళాశాల ప్రిన్స్ పల్ చంద్రశేఖర్ , డా.భారతి , టాటా కాన్సర్ ఆసుపత్రి డాక్టర్లు , స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొనారు.
Prajavartha Online Telugu News