-మిన్హజ్ ఆలం రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు రుణ సదుపాయం: డి ఆర్ ఓ కోదండరామిరెడ్డి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడం జరుగుతుందనీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రెటరీ మిన్హజ్ ఆలం తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని డి ఆర్ ఓ చాంబర్ నందు న్యూ ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రెటరీ మిన్హజ్ ఆలం పి ఎం ఎఫ్ ఎం ఈ పథకం అమలుపై అన్ని జిల్లాల్లోని సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి డి ఆర్ ఓ కోదండరామిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అడిషనల్ సెక్రటరీ మాట్లాడుతూ..జిల్లాలో లక్ష్యం మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను గణనీయంగా పెంచాలి అని అన్నారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా పొందాలనుకునే వివిధ వర్గాల వారికి ఈ పథకం ద్వారా లబ్ధి పొంది ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆహార పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ప్రభుత్వము పెద్ద మొత్తంలో సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ.. జిల్లాకు 340 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ల లక్ష్యానికి గాను 106 యూనిట్స్ ల కు బ్యాంకుల ద్వారా లోన్లు మంజూరు చేయడం జరిగిందని , రూ.10 లక్షల వరకు యూనిట్ సైజు పరిమాణం బట్టి సబ్సిడీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఔత్సాసాహికులుఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Prajavartha Online Telugu News