Breaking News

గ్రామీణ స్థాయి లో పశుపో షణ ద్వారా రైతులకు ఆర్ధిక పురోగతి చెందే విధంగా చర్యలు.

– జాతీయ లైవ్ స్టాక్ మిషన్ – ఔత్సాహిక రైతులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహం..
-జాతీయ లైవ్ స్టాక్ మిషన్ ను రైతులు అవగాహన పెంచుకొని ఆర్థికంగా బలోపేతం చెందాలి.
-జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు
-జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ స్థాయిలో పశుపోషణ ద్వారా రైతులకు ఆర్ధిక పురోగతి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని విశిష్ట అతిథి, జిల్లా జాయింట్ కలెక్టర్ఎన్. తేజ్ భరత్, ముఖ్య అతిథి జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షులు బూరుగుపల్లి సుబ్బారావు లు పేర్కొన్నారు.మంగళవారం స్థానిక  వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ లైవ్ స్టాక్ మిషన్” జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, జిల్లా వ్యవ సాయ సలహా మండలి అధ్య క్షులు బూరుగుపల్లి సుబ్బా రావు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టరు ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ అవగాహన సదస్సు కు విచ్చేసిన రైతులు పశుపోషన పట్ల పూర్తి అవగాహన పెంచుకొని ఆర్థికంగా బలోపేతం చెందాలని అన్నారు. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ అవగాహన సదస్సు నిధులతో 2021- 22 నుండి 2025 – 26 సం.రాల కాల పరిమితి లో ఔత్సాహిక రైతులను వ్యాపారసరళిలో ప్రోత్సహిం చేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. జిల్లాలో జగన్న పాల వెల్లువ పథకాన్ని పశుపోషక రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయన్నారు. పశువుల ఆరోగ్యానికి భద్రత, భరోసా కల్పిస్తూ తద్వారా పాడిరైతులకు, పశువుల పెంపకందార్లకు అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. మూగ జీవాలు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు 1962 నంబర్ కు కాల్ చేస్తే సత్వరమే పశువుల అంబులెన్స్ లు పశువులు ఉన్న ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. పాడి పశువులతో పాటు గొర్రెలు, మేకలు వంటి జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం గురించి పశుపోషక రైతులకు అవగాహన కల్పించాలన్నారు. గొర్రెలు, మేకలు, కోళ్లు, పందులు, కోళ్ల పంపకానికి కేంద్రం ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుందని అన్నారు. గొర్రె లు, మేకలు, పెంపకం యూనిట్ పధకం లో 100 గొర్రెలు , మేకలు 5 పొట్టెళ్లు, మేక పోతులు లకు రూ.10 లక్షల రాయితి నుంచి 500 గొర్రెలు, 25 పొట్టేళ్లు, మేకపోతులకు యూనిట్ కు రూ.కోటి వరకు అంతకు మించి ప్రాజెక్ట్ విలువ ఉన్నచో గరిష్టం గా 50 లక్షలు రాయితీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఔత్సాహిక రైతులను, వ్యాపార సరళి లో ప్రోత్సహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. గొర్రెలు, మేకలు పెంపకం, కోళ్ల పంపకం, పందుల పంపకం, పశుగ్రాస, దాణా తయారీలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అసంఘా టితంగా ఉన్న పశు సంవర్ధక రంగాన్ని వ్యవస్థి కృత రంగాన్ని అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. పాలు, గ్రుడ్లు, మాసం, ఉత్పత్తిని పెంచి, వాటికి సరైన మార్కటింగ్ సౌకర్యాలు గ్రామీణ స్థాయి లో ఉపాధి అవకాశాలు మెరుగు పరచడం జరుగుతోందని అన్నారు. జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం పై రైతులకు రుణ సౌకర్యం కల్పించేందుకు యూనియన్ బ్యాంక్,కార్పోరేషన్ బ్యాంకులు ముందుకు వచ్చాయన్నారు. రైతులకు ఆయా బ్యాంకులతో అనుసందానం చేసి రుణాలు అందించే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఆర్బీకే ల స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించవచ్చునని తద్వారా జిల్లాను పశుపోషణలో అగ్రగామిగా నిలపవచ్చునని జాయింట్ కలెక్టరు పేర్కొన్నారు.జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, ముఖ్య అతిథి బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆర్బీకేలు ఏర్పాటు చేసి వ్యవసాయం అనుబంధం శాఖలను ప్రతీ గ్రామంలో రైతులకు లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. రైతులకు, నిరుద్యోగులకు ప్రోత్సాహం కల్పించి గ్రామ స్థాయి లో పశు సంవర్ధక శాఖ పశు పోషణ ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. జాతీయ లైప్ స్టాక్ పథకాన్ని రైతులు అవగాహన చేసు కొని ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిపుచ్చు కోవాలని పులుపునిచ్చారు. జిల్లా వ్యాప్తముగా ఔత్సాహిక రైతులను, నిరుద్యోగులను ప్రోత్సహిస్తూ పశుసంవర్ధకశాఖ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ నిధులతో గ్రామీణ స్థాయిలో పశు పోషణ ద్వారా ఆర్ధిక పురోగతి సాధిం చుకొనే దిశలో ఈ అవగాహన కార్యక్రమము నిర్వహించడం రైతుల వరం అని అన్నారు.జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా.ఎస్.టి.జి.సత్యగోవింద్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. జిల్లా పశు సంవర్ధక శాధికారి కార్యాలయం నందు ప్రత్యేక ఎన్ఎల్ఎం సంబంధిత హెల్ప్ డెస్క్ నిర్వహిస్తామని తెలిపారు.అనంతరం టెక్నీకల్ అధికారి, ఎ. వీ. ప్రసన్న కుమార్, రైతు లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన పరిచారు.ఈ కార్యక్రమములో పశు సంవర్ధక అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, జిల్లా ప్రత్యేక అధికారి డా.బి. చంద్ర మౌళి నాయక్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, డి. వి. ప్రసాద్, జిల్లా అధ్యక్షులు, గొర్రెలు, మేకలు సహకార సంఘం జిల్లా అధ్య క్షులు, దండుబోయిన వీర వెంకట సత్యనారాయణ మూర్తి, అధ్యక్షులు, జిల్లా గొర్రెలు, మేకలు పెంపకం దారులు సహకార సంఘం ఎ.వి. కృష్ణా రావు, వ్యవసాయ శాఖాధికారి, యస్.మాధవ రావు, జె. డి. జిల్లా పశు సంవ ర్ధక శాఖాధికారి డా.ఎస్. టి.జి. సత్య గోవింద్, జిల్లాలోని మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, ప్రాథమిక గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘ అధ్య క్షులు, ఔత్సహిక, అభ్యుదయ రైతులు, అధికారులు ముక్కెన వెంకటేశ్వర్లు డా . రాధాకృష్ణ , డా.ఎస్.రూపకళ, డా.కె. సత్యనారాయణ, డా.వై. శ్రీనివాసరావు ,డా. ఎం.ఎస్.ఎన్. మూర్తి, డా. ఎ. వెంకటరెడ్డి , డా.సి.ప్రభావతి, డా.మోసిస్ వెస్లీ, జిల్లా లోని పలు పశువైద్య శాలల పశువైద్యులు, సహాయకులు, పారా వెటర్నరీ సిబ్బంది తదితారులు పాల్గొన్నారు.సమావేశంలో భాగంగా పశు పోషణ – లైవ్ స్టాక్ మిషన్ కరపత్రం ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *