– పశు కిసాన్ క్రెడిట్ రుణాలు సరళి కృతంగా ఇవ్వాలి
-జగనన్న తోడు, పిఎం స్వానిధి కింద లబ్ధిదారులకు చేయూత ఇవ్వండి
-200 లైవ్ స్టాక్ యూనిట్స్ స్థాపన కోసం బ్యాంకర్లు చొరవ చూపాలి
-జే ఎల్ బి సి సమావేశాలకు బ్యాంకర్లు హాజరు కావాలి
– సెప్టెంబర్ 30 నాటి ప్రగతిపై అక్టోబర్ మొదటి వారంలో సమావేశం
– డి ఎల్ ఆర్ సి సమావేశంలో హాజరుకాని బ్యాంకర్ల నుంచి వివరణ కోరతాం
– జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత, సంక్షేమ పథకాలకు చెందిన రుణాలు మంజూరు లో బ్యాంకర్లు మరింతగా దృష్టి పెట్టాలని, తొలి త్రైమాసిక పురోగతి ఆశించిన స్థాయిలో లేదని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు.మంగళ వారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) అండ్ DCC సమావేశం కు జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను డిబిటి ద్వారా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమ అవ్వడం ద్వారా బ్యాంకులు ఆర్థిక ప్రయోజనం కలుగుతున్న దృష్ట్యా, ఆమేరకు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. బ్యాంక్ ఖాతాలు లేని వారికి కొత్తగా అకౌంట్స్ ప్రారంభించడానికి రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంటే, ఆయా సచివాలయ పరిధిలోని వాలంటీర్ లకు అనుసంధానం చెయ్యాలని అన్నారు. ఆమేరకు సర్వీస్ ఏరియా వారీగా అక్టోబర్ నెలలో పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు. ప్రాథమిక రంగంలో రుణాలు మంజూరు కు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం – బ్యాంకర్ల మధ్య సమన్వయం సాధించడం చాలా ప్రాధాన్యత అంశంగా పేర్కొన్నారు. అర్భిఐ మార్గదర్శకాలు మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు కి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జేసీ పేర్కొన్నారు. సదరు రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు.బ్యాంకర్లు కౌలు రైతులకు, సిసిఆర్సి కార్డు దారులకు క్రాప్ రుణాలు ఉదారంగా మంజూరు చేయాలని, తద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సాధ్యం అవుతుందన్నారు. ప్రాథమిక రంగంలో కౌలు రైతులకు, పశు కిసాన్ క్రెడిట్ రుణాలు సరళి కృతంగా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యత జగనన్న తోడు, పిఎం స్వానిధి కింద లబ్ధిదారులకు చేయూత నివ్వడంలోన్ చార్జి మాడ్యుల్ లో భూమి యజమాని పేరుతో పాటు, కౌలు రైతుల వివరాలు కూడా వెబ్ సైట్ లో చూసే అవకాశం ఉందని, ఆమేరకు బ్యాంకర్లు లక్ష్యాలను సాధించాలన్నారు. రైతులకు ఇచ్చే రుణాలు తప్పకుండా వసూలు చెయ్యడానికి జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు.పశు కిసాన్ క్రెడిట్ రుణాలు సరళి కృతంగా ఇవ్వాలని, అమూల్ కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున బల్క్ మిల్క్ యూనిట్స్ ఏర్పాటు చేసి మద్దతు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. స్వల్ప కాలిక రుణాలు రూ.30 వేలు, దీర్ఘకాలిక రుణాలు రు.80 వేల నుంచి లక్ష వరకు ఇవ్వవొచ్చు నని పేర్కొన్నారు. వాటికి చెందిన రుణ చెల్లింపు లో ఎటువంటి సందేహం అక్కర్లేదని, అమూల్ ద్వారా ఆయా లబ్దిదారుల ఖాతాకు జమ అవుతుందని స్పష్టం చేశారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ఆరు మండలాల్లో జగనన్న పాలవెల్లువ పశు సంపద కు చెందిన రుణాలు ఇవ్వడానికి ముందుకు రావాలని తేజ్ భరత్ కోరారు. పశు సంపద పెరగాలని ఆమేరకు దీర్ఘ కాలిక రుణాలు మంజూరు చేయాలని అన్నారు. విద్యా రుణాల మంజూరుకు మరింత చొరవ తీసుకుని మద్దతుగా బ్యాంకర్లుజిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జగనన్న తోడు కింద 90 శాతం మందికి, హౌసింగ్ కోసం అదనపు పెట్టుబడి రుణాలను 82 శాతం మేర లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. జీవనోపాధికి చెందిన రుణాల మంజూరుకు బ్యాంకర్లు 100 శాతం ఇవ్వాలని పేర్కొన్నారు. రుణాలు మంజూరు చేసే విధానం లో ఎటువంటి ఫీజులు వసూలు చేయరాదని అధికారులు తెలిపారు.మహిళా పారిశ్రామిక అభివృద్ధి కోసం 275 యూనిట్స్ సిఫార్సు చెయ్యగా బ్యాంకర్లు 79 మందికి చెందిన రుణాలు మంజూరు చేశారని, మిగిలిన యూనిట్స్ గ్రౌండింగ్ చెయ్యాలని కోరారు. పి ఎం స్వా నిధి కి చెంది 607 యూనిట్స్ కి రుణాలు మంజూరు చేయావలసి ఉందన్నారు.చేతివృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి “ప్రధాన మంత్రి విశ్వ యోజన” కింద 18 రంగాలకు చెందిన వారికి రుణాలు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. ఆక్రమంలో క్షేత్ర స్థాయి లో లబ్దిదారుల గుర్తింపు చెయ్యడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 5 శాతం వడ్డీ రేటు తో లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం ఉందని తెలిపారు.ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ డివిజన్ ప్రాంతీయ అధికారి ఏ. హరిబాబు, అర్భీఐ ప్రాంతీయ అధికారి ఏ. నాగ ప్రవీణ్, ఎల్ డి ఎం . డి వి ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు ఎస్. సుభాషిణి, డి ఐ ఒ బి .వేంకటేశ్వర రావు, ఎస్. మాధవ రావు, సిబ్బి కే. శ్రీనివాస రావు, ఇతర అధికారులు, బ్యాంకర్లు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News