-జిల్లా ప్రధాన న్యాయమూ గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 2 వరకు దేశవ్యాప్తంగా “వ్యర్ధ రహిత భారతం” నేపధ్యంగా జరిగే “స్వచ్ఛత హీ సేవ-2023” ప్రచారంలో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న అన్ని న్యాయస్థానాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత మంగళవారం ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా తెలియజేశారు.పునర్వినియోగానికి పనికిరాని ప్లాస్టిక్ వాడకాన్ని తగు ప్రత్యామ్నాయల ద్వారా నిషేదించడం, ప్రజలు వారి ఇళ్లను, పరిసరాలను, వారు పని చేస్తున్న కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. , రోజువారీ పనులను పూర్తిగా వ్యర్ధ రహితం చేయాలని (zero waste events), పర్యావరణ పరిరక్షణ కోసం మన జీవన శైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని అన్నారు.ముఖ్యంగా బస్సుల్లోనూ, రైళ్లలోనూ, బహిరంగ ప్రదేశాలలోనూ వ్యర్ధాలను ఇష్టానుసారం పారవేయరాదని సూచించారు. వీటితో పాటు ఈ పక్షం రోజుల్లో ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత కోసం శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొని ఆ ఫోటోలను https://swachhatahiseva.com వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని కోరారు.స్వచ్ఛ భారత దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు . ఈ “స్వచ్ఛత హీ సేవ-2023” మహోద్యమంలో జిల్లా ప్రజలందురూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News