Breaking News

విద్యుత్ భద్రతా అవగాహన సదస్సు

రంగంపేట , నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ప్రమాదములు నివారించుటకు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం, జి.దొంతమూరు గ్రామం నందు రైతులతో ఏ.పి.ఈ.పి. డి.సి.యల్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ టి.వి.ఎస్.యెన్ మూర్తి ఆద్వర్యం లో విద్యుత్ భద్రతా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడము జరిగినది.ఈ యొక్క కార్యాలయములో సిబ్బందికి, పంచాయతీ విద్యుత్ కార్మికులు , ప్రైవేట్ విద్యుత్ కార్మికులు, కొబ్బరి, పామాయిల్ రైతులు, దింపు కార్మికులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులు కు విద్యుత్ భద్రతపై పలు సూచనలు చేయడం జరుగుచున్నది.జిల్లా వ్యాప్తముగా APEPDCL అధికారులు అందరూ గ్రామ వార్డు సచివాలయముల నందు, కాలేజీలు మరియు స్కూల్స్ నందు ముఖ్యమైన కూడలినందు, ఇతర ఆఫీసుల నందు విద్యుత్ భద్రతా అవగాహన సదస్సులు నిర్వహించుచున్నట్లు తెలియ జేసారు. ఈ కార్యక్రమములో అనపర్తి ADE, గ్రామ సర్పంచ్. రంగంపేట మండలంలో గల పామాయిల్ రైతులు కూలీలు మరియు గ్రామ ప్రజలు పాలుగొన్నారు. విద్యుత్ వినియోగదారులు పాటించాల్సిన భద్రతా సూచనలు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1912. ఇళ్ల డాబాపైన బట్టలు ఆరవేయునప్పుడు, ఇళ్ల నిర్మాణము జరుగుచున్నపుడు ఇళ్ల పైన / సమీపాన విద్యుత్ లైన్లు ఉన్నచో విద్యుత్ నిబంధనల ప్రకారం తగినంత దూరం పాటించవలెను. తోటలలో కానీ, పొలాలలో కానీ, ఇతర ఏ ప్రదేశములోనైనా విద్యుత్ ప్రసారం జరిగే తీగలు (Conductor) తెగి పడి ఉంటే వాటిని నేరుగా తాకరాదు, వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి లేదా 1912 కి తెలియచేయవలెను బాల్కనీ బయట వైపు ప్లాస్టరింగ్ చేయునప్పుడు , ఇనపరాడ్లు వంచునప్పుడు, ఇనపరాడ్లు కోయునప్పుడు, ఇనపరాడ్లు మేడమీదకు తీసుకొని పోవు సమయమున, బాల్కనీ బయట వైపు రంగులు వేయు సమయమున ,చుట్టుపక్కల గల విద్యుత్ తీగలు ,పరికరముల ను పరీశీలించవలెను. లారీ డ్రైవర్స్, క్లీనర్స్ మెటీరియల్ దింపు చేయుటకు, లారీ క్లీన్ చేసుకొనుటకు లారీ ట్రక్ పైకి ఎత్తు సమయంలో, మెటీరియల్ లోడ్ చేసి తార్పలిన్ కప్పి తాడుతో కట్టు సమయంలో మరియు హైడ్రాలిక్ ద్వారా ట్రిప్పర్స్ మరియు లారీ ల లో ఉన్న సరుకుని ఆన్ లోడింగ్ చేయు సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగలను సరిగా గమనించక విద్యుత్ ప్రమాదంలకు గురి అగుచున్నారు. లారీ డ్రైవర్స్, క్లీనర్స్, కార్మికులు విద్యుత్ ఘాతమునకు గురి అగుచున్నారు. తోపుడు బళ్ళు వర్తకులు, ఓనర్స్ వర్తకులు వివిధ ప్రదేశములలో వ్యాపారం చేయునప్పుడు తోపుడు బళ్ళు చుట్టుపక్కల విద్యుత్ ట్రాన్సఫార్మెర్స్, కేబుల్స్, ఫ్యూజ్ బాక్స్ లను, మరియు పైన గల విద్యుత్ తీగలను పరిశీలించి తగిన జాగ్రత్తలు పాటించ వలసిందిగా కోరడమైనది. చేతులు పైకి ఎత్తు సమయంలో, వ్యాపారం ముగించి వెళ్లునప్పుడు మెటీరియల్ బండి మీద పెట్టి తార్పలిన్ కప్పి తాడుతో కట్టు సమయంలో, ఉన్న సరుకుని బండి మీద పెట్టి ఆన్ లోడింగ్ చేయు సమయంలో చుట్టుపక్కల విద్యుత్ ట్రాన్సఫార్మెర్స్, కేబుల్స్, ఫ్యూజ్ బాక్స్ లను మరియు పైన ఉన్న విద్యుత్ తీగలను సరిగా గమనించక విద్యుత్ ప్రమాదంలకు గురి అగుచున్నారు.అదే విధముగా విద్యుత్ నియంత్రిక లకు , ట్రాన్సఫార్మెర్స్ లకు, ఫ్యూజ్ బాక్స్ లకు తార్పలిన్ ను తాళ్లతో కట్టరాదు అని విజ్ఞప్తి చేయుచున్నాము. మనం ప్రయాణించే వాహనాలపై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు జారిపడినా లేదా వాటికి మనం ప్రయాణించే వాహనం తగిలినా, వాహనంలో నుంచి బయట పడేందుకు హాపింగ్ (గెంతుట లేదా దుముకుట) విధానం అనుచరించవలెను.వ్యవసాయ పంపుసెట్లకు సంబంధించి మోటారు స్టార్టర్లు స్విచ్చులు ఉన్న ఇనుప బోర్డులను విధిగా ఎర్తింగ్ చేయవలయును. విద్యుత్ షాక్ తగలకుండా ఉండేందుకు 30 ఎమ్ఎ సామర్ధ్యం కలిగిన  RCCB ని మాత్రమే ఉపయోగించవలెను.  తడి చేతులతో మరియు నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్చులను, సంబంధిత పరికరాలను తాకరాదు. సరియైన విద్యుత్ ధ్రువ పత్రం కలిగిన ఎలక్ట్రీషియన్  ను మాత్రమే మరమత్తులు కొరకు వాడుకొన వలెను. ఎటువంటి లూజు కాంటాక్టులు లేకుండా చూసుకొనవలెను. కరెంటుకు సంబంధించిన ఏ పని చేయుచున్నను విధిగా చెప్పులు మరియు చేతి తొడుగులు ధరించి చేయవలెను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *