Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష ప్రయోగాత్మక వైద్య శిబిరాన్ని సందర్శించి దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

– ఈ నెల 30 నుండి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు
– జిల్లాలో 383 జేఏసీ వైద్య శిబిరాలను విజయవంతం చేయాలి
– 164 వి హెచ్ సి, 21 యూ హెచ్ సి పరిధిలో జే ఎ సి శిబిరాలు
-శిబిరంలో డేటా ఎంట్రీ, మందుల పంపిణీ ప్రక్రియ పరిశీలన
– జిల్లా కలెక్టర్ డా కే . మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి వైద్య పరంగా సేవలు అందుబాటులో కి తేవడం జరిగిందని, మరో అడుగు ముందుకు వేసి “జగనన్న ఆరోగ్య సురక్ష” ద్వారా వైద్య శిబిరాల ద్వారా ప్రజల చేంతకే వైద్య సేవలు తీసుకుని వెళ్ళడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత పేర్కొన్నారు.మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామ గ్రామ సచివాలయంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన “జగనన్న ఆరోగ్య సురక్ష ” వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 వ తేదీ నుండి నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించనున్నామని తెలిపారు . తొలి రోజు 17 చోట్ల వైద్య శిబిరాలకు చెందిన సమగ్ర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా కాతేరు చేపట్టిన వైద్య శిబిరం ద్వారా క్షేత్ర స్థాయి లో సమస్యలను తెలుసుకుని, జే ఎ సి శిబిరాలను విజయవంతం చేయాలని కోరారు, ఆమేరకు సంబందిత అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. ప్రజలతో మాట్లాడుతూ, ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరికీ కుటుంబ వైద్యుల సేవలు అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. ఈ నెల 30 నుండి నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత స్పష్టం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఈ నెల 15 న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై గృహ సందర్శనతో సర్వే చేపట్టి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరణ, గ్రామ / వార్డు ల వైద్య శిబిరం పై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వారి పరిధిలోని గృహ సందర్శన చేసి ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష తో పాటు ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఏఎన్ఎం, సిహెచ్ఓ ల గృహ సందర్శన తేదీలను తెలిపిన అనంతరం, ఏఎన్ఎం, ఆశా, వాలంటీర్లు ఒక బ్యాచ్ గా, సీహెచ్ఓ, వాలంటీర్లు, ఆశాలు మరొక బ్యాచ్ గా గృహ సందర్శన చేస్తారన్నారు. అదే సమయంలో వారి ఇంటి వద్దనే వారి సెల్ ఫోన్ నందు ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్లోడ్ చేసి ఎలా వినియోగించాలో తెలియ జేస్తారన్నారు. పర్యవేక్షణ సమయంలో ఇంటివద్దనే ఏడు రకాల పరీక్షలు చేసి ఆరోగ్య వివరాల రిపోర్టును మొబైల్ యాప్ నందు నమోదు చేసి ప్రొఫైల్ జెనరేట్ చేసి, కేస్ షీట్ జెనరేట్ చేసి, పరీక్షల రిపోర్టులు వైద్య శిబిరాలు నిర్వహించే తేదీ నాటికి డాక్టర్ల కు అందుబాటులో ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరుగు తోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైద్య శిబిరాలు క్షేత్ర స్థాయిలో ఈ నెల సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం అవుతాయని అన్నారు. అలాగే వైద్య శిబిరాలకు 3 రోజుల ముందు మళ్ళీ ఒకసారి వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు కలిసి గృహ సందర్శనలో ప్రజలకు వైద్య శిబిరం వివరాలు తెలపాల్సి ఉంటుందని కలెక్టరు అధికారులకు సూచించారు.నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా వైద్య శిబిరం నిర్వహణ చేపట్టడం జరిగిందనీ, మన జిల్లాలో కాతేరు లో వైద్య శిబిరాన్ని ట్రయల్ రన్ గా (పైలట్ ) చేపట్టడం జరిగిందన్నారు. ముందస్తు సమాచారం మేరకు ఉదయం నుండి చాలా మంది ప్రజలు ఈ వైద్య శిబిరానికి వస్తున్నారని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి నిపుణులైన డాక్టర్లు, ఆరోగ్యశ్రీ కి సంబంధించిన డాక్టర్లు, అలాగే పీ హెచ్ సి ల నుండి ఇద్దరు డాక్టర్లు, సి హెచ్ సి నుండి ఇద్దరు సంబంధిత వ్యాధి వైద్య నిపుణులు, కంటి పరీక్షల నిపుణులు ఉన్నారన్నారు. కంటి వెలుగు కింద గతంలో పరీక్ష చేయించుకున్న వారికి కంటి అద్దాలు ఈ శిబిరాల్లో ఇస్తారని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలకు సంబందించి కొత్తగా ఎవరైనా పరీక్షలు చేయించు కొనుటకు ఇక్కడ అవకాశం ఉందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులు ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి ఈ మెడికల్ క్యాంపులు ద్వారా చికిత్స అందించండం ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అవసరమైన కేసులను రెఫరల్ హాస్పిటల్ కు పంపి ఆరోగ్యశ్రీ కు అనుసంధానం చేసి ప్రజల మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్యోద్దేశ్యం అన్నారు. వైద్య శిబిరాల్లో వైద్యలు చికిత్స తదుపరి ఏవిధంగా ఏయే సమయాల్లో మందులు ఏలా వాడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరల ఏప్పుడు రావాలని అనే అంశాలను కూడా వైద్యులు తెలిజేస్తారని కలెక్టరు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం మార్గదర్శకాల మేరకు జిల్లా, మండల, గ్రామ , మునిసిపాలిటీ వారీగా అధికారులు అన్ని స్థాయిలలో సమన్వయంతో పని చేసి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను విజయవంతం చేయాలని కోరారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో ఒక ఆరోగ్య కార్యకర్త వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ప్రజలకు రిజిస్ట్రేషన్ మొదలు ఓపి చీటీ అందజేయడం, సంబంధిత డాక్టర్ రూమ్ చూపడం మందులు తీసుకుని వెళ్ళేవరకు సహకారం అందిస్తారని అన్నారు. అన్ని ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కే. వెంకటేశ్వరారవు మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అందరికీ ఆరోగ్య పరీక్షలు చేపట్టాలన్న ఆలోచన అమలుతో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రూపుదిద్దు కుందని అన్నారు. జిల్లాలో నేడు ప్రయోగాత్మకంగా కాతేరు గ్రామంలోని సచివాలయం -1 లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పైలట్ గా ప్రారంభించామన్నారు. .ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కే.వెంకటేశ్వరారవు, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ డా. ప్రియాంక, నియోజక వర్గ ప్రత్యేక అధికారి కె యస్ జ్యోతి, డిప్యూటీ డిఎం హెచ్ ఓలు డా. హరిబాబు, డా. సంధ్య, కాతేరు పిహెచ్ సీ వైద్యులు డా. సుధాకర్, డా.  లక్ష్మీదేవి, ఐసీడిఎస్ పిడి కె. విజయ కుమారి, వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *