Breaking News

ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటే కీలకం

-18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ తప్పకుండా ఓటరుగా నమోదు చేయండి
-నచ్చిన పాలకులను ఎన్నుకొనేందుకు ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.
-నిడదవోలు పట్టణంలో “స్వీప్” పై అవగాహన సదస్సు
-కలెక్టర్ కే. మాధవీలత

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపుదిద్దడం జరుగుతోందని, ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని
జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పిలుపు నిచ్చారు.

శనివారం నిడదవోలు ఎస్ వి దుర్గాంబ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా. మాధవీలత హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ, ఎన్నికలు, ఓటు హక్కు, ఏ విధంగా నమోదు చేసుకోవాలి, పి.ఎస్ అంటే ఏమిటి ? బి ఎల్ ఓ అంటే ఎవరు అనే విషయాలు పై మీకు అవగాహన ఉందా అని ప్రశ్నించారు. భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే ఉద్దేశంతో స్వీప్ కార్యక్రమాన్ని, డిసెంబర్ 2 , 3 శని, ఆది వారాల్లో ప్రత్యేక ఓటరు గుర్తింపు, నమోదు ను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చెయ్యడం జరుగుందన్నారు. బి ఎల్ ఓ అంటే బూత్ స్థాయి అధికారి అని ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్న ఓటర్లను గుర్తించి, వారికి ఓటు హక్కు కలుగ చెయ్యడం వారి బాధ్యత అన్నారు. అర్హత కలిగి ఉండి ఇంకా ఓటు లేని వారు ప్రత్యేక శిబిరాలు వద్ద కు వచ్చి వారికి ఓటు ఉందో లేదో సరి చూసుకోవాలి అని కోరారు. ఇప్పటికే 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు హక్కు లేకపోయినా, 2024 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వాళ్ళు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటరు నమోదు, ఫారం 6 బి ద్వారా ఓటరు గుర్తింపు కార్డు కి ఆధార్ అనుసంధానం, ఫారం 7 ద్వారా మరణించిన వారి పేర్లు తొలగింపు, వేరొక నియోజక వర్గం కి, రాష్ట్రానికి బదలీ ఐతే తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫారం 8 ద్వారా అక్షర దోషాలు, ఫోటో మార్పు, డోర్ నంబర్ మార్పు , వేరే పోలింగ్ కేంద్రానికి మార్పు వంటివి చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపుదిద్దడం జరుగుతోందని, డిసెంబర్ 9 లోగా ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, ఆమేరకు ఓటు హక్కు లేని వారు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటరుగా నమోదు కావాలని పిలుపు నిచ్చారు

బూత్ స్థాయి లో బి ఎల్ వో లు ద్వారా నమోదు, తోలగింపు , మార్పులు చేర్పులు కోసం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటు లో ఉండడం జరుగుతుందని, ఆదివారం కూడ పోలింగ్ కేంద్రాల వద్ద బి ఎల్ ఓ లు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నిడద వోలు పట్టణం లోని జెడ్పీ బాలికొన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని, నగరంలోని నిడదవోలు సచివాలయం 8 లోనూ, మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ప్రత్యేక శిబిరాన్ని కలెక్టర్ డా. మాధవీలత అధికారులతో కలసి పర్యవేక్షించారు.

ఈ సందర్బంగా బాలికతో ముచ్చటిస్తూ.. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న భోజనం తీసుకుంటున్నావా? రక్తంలో హిమో గ్లోబిన్ శాతం ఏంతవుందని వివరాలు అడుగగా..11 శాతం ఉందని సమాధానం చెప్పిన బాలికను కలెక్టర్ అభినందించారు.

కలెక్టర్ పర్యటన లో ఆర్డీవో కృష్ణ నాయక్, నిడదవోలు ఈ ఆర్వో ఏం. ఝాన్సీ రాణి, ఎం ఆర్ ఓ ఎమ్. గంగరాజు, మునిసిపల్ కమిషనర్ కె వి పద్మావతి , విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *