రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిని, అక్కడ ఉన్న వైద్య సదుపాయా లను పరిశీలించారు. వంటశాలను, ఆహార ప్రమాణాలను పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేయబడిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. వెల్డింగ్ మరియు ఇతర నైపుణ్యాలలో శిక్షణ పొందుతున్న ఖైదీలతో మాట్లాడారు. వారు విడుదలైన తరువాత జీవనోపాధి కోసం ఈ శిక్షణ ఉపాయోగకరంగా ఉంటుందని అన్నారు. ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్లతో మాట్లాడారు. ఖైదీలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సేవల గురించి అందరికీ తెలియజేయాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి కేసు వివరాల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియ జేయాలన్నారు. కారాగార వైద్య సిబ్బందితో మాట్లాడి ఖైదీల ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పరిశీలనలో భాగంగా ఖైదీలతో కలిసి భోజనం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *