ప్రజా సంక్షేమమే జగనన్న పాలసీ

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో ఏడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు పరుస్తూ పేదలకు చేరువయ్యారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తమ్మిన దుర్గారావు వీధిలో విస్తృతంగా పర్యటించి.. 274 గడపలను సందర్శించారు. గత ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. గతంలో పాలన అంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉండేదని.. కానీ పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన సచివాలయాల ద్వారా సేవలన్నీ ప్రజల గుమ్మం వద్దకే వస్తున్నాయని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్, 2వేల జనాభాకు సచివాలయం ఏర్పాటుతో పాలన మరింత సుగుమం అయిందని తెలిపారు. ఏ సంక్షేమ పథకమైనా, సమస్య ఎటువంటిదైనా వాలంటీర్లను అడిగితే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఈ నాలుగున్నరేళ్లలో ప్రజలలో బలంగా ఏర్పడిందని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

టీడీపీ, జనసేన పేర్లు పలకడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదు
ఎన్నికలలో గుర్తింపు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న జనసేన కూడా తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పొత్తులపై ప్రశ్నించే వారందరినీ వైసీపీ సానుభూతిపరులని పవన్ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో.. ఇలా ఎవరితో కలిస్తారో, ఎప్పుడు కలుస్తారో వారికే స్పష్టత ఉండదని విమర్శించారు. పైగా పార్టీ పెట్టిన పదేళ్లలో ఒక్క శాతం కూడా ఓట్లను పెంచుకోలేకపోయిన మీరు.. ముఖ్యమంత్రి గ్రాఫ్ ను ప్రతీరోజు అరశాతం తగ్గిస్తానమని బీరాలు పలకడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల గూర్చి ప్రతిపక్షనేత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో మంచి చేయకపోగా.. రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసి, ఏపీని సర్వశాసనం చేశారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి హోదాను సమాధి చేసింది మీరు కాదా..? అని సూటిగా ప్రశ్నించారు. కమీషన్ల కోసం ఆనాడు ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసి, ఇష్టానుసారంగా వందిమాగదుల కంపెనీలకు నిధులను దోచిపెట్టింది వాస్తవం కాదా..? సమాధానం చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ తో రూ. 843.53 కోట్లను ఆదా చేయడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్లిందని.. ఆనాడు చంద్రబాబు చేసిన తప్పులను రాష్ట్ర ప్రజలు నేటికీ భరించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కనుకనే తెలుగుదేశం పేరు ఎత్తడానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని.. రాబోయే రోజుల్లో టీడీపీకి మరోసారి గట్టి గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, తోపుల వరలక్ష్మి, శోభన్, నేరెళ్ల శివ, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *