-ఈఆర్వో – ఎస్ సరళా వందనం
రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క ఓటరు ఫారం 6 ద్వారా తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని రాజమండ్రి రూరల్ నియోజక వర్గ ఈ ఆర్ వో, ఎస్ డి సి – ఎస్ సరళ వందనం విజ్ఞప్తి చేశారు. శనివారం కొలమూరు పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, ఓటరు నమోదు కార్యక్రమం పరిశీలించారు. ఈ సందర్భంగా సరళ వందనం మాట్లాడుతూ, స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద డిసెంబర్ 2 , 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు, ఓటరు గుర్తింపు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 వ తేదీ వరకు ఓటరు నమోదు ప్రక్రియ లో భాగంగా మార్పులు చేర్పులు, తొలగింపులు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమం నియోజక వర్గ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. 18 ఏళ్లు నిండిన, జనవరి ఒకటవ తేదీన నాటికి 18 ఏళ్లు నిండే యువ ఓటర్లు ముందుకి వొచ్చి ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫారం 7 ద్వారా వేరే చోటుకి వెళ్లిన, మరణించిన సందర్భంలో ఓటు తొలగింపు కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. పేరులో తప్పులు ఉన్నా, ఫోటో మారిన, డోర్ నంబర్ మారినా అటువంటి వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ సమ్మారీ రివిజన్ లో వొచ్చే ప్రతి ఒక్క దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చెయ్యాలని, ఆయా దరఖాస్తు లపై తీసుకున్న చర్యలు కూడా నమోదు చెయ్యవలసి ఉంటుందన్నారు. శనివారం కొలమూరు పోలింగ్ కేంద్రానికి కొత్తగా ఓటు నమోదు కోసం, పేరులో తప్పును సరి చేసుకునెందుకు, చిరునామా మార్పు కోసం వేరొక చోట నుండి ఇక్కడికి ఓటును బదలీ చేసుకునేందుకు ఓటర్లు రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఇంకా ఓటరుగా నమోదు కావలసి ఉందని, ఆమేరకు ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కోసం స్వీప్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నట్లు సరళా వందనం పేర్కొన్నారు. ఈ పర్యటన ఈ ఆర్ ఓ వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాగర్, బి ఎల్ వో లు తదితరులు ఉన్నారు .
Prajavartha Online Telugu News