Breaking News

భారత నైపుణ్య పోటీలు -2023

-ఆసక్తి ఉన్న యువత నుంచి దరఖాస్తుల ఆహ్వానం
-డిసెంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు
-కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ నైపుణ్యాల పోటీలు 2024లో భాగంగా, ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ – జాతీయ నైపుణ్యాభివృద్ధి సహకారంతో భారతదేశ నైపుణ్యాల పోటీ 2023 ను నిర్వహిస్తోందని , ఈ పోటీల్లో పాల్గొనేందుకు డిసెంబర్ 20 వ తేదీలో గా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

దరఖాస్తుల నమోదు కోసం:
http://engineering.apssdc.in/worldskillsap/ ను సందర్శించి ఆసక్తి కలిగి ఉన్న వారు వారి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా నుంచి ఈ పోటీల్లో యువత పాల్గొనడానికి మరింత గా ప్రోత్సహించండం జరుగుతోందని అన్నారు. జిల్లా నుంచి ఇప్పటి వరకూ 810 మంది వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు.

భారత నైపుణ్య పోటీలు -2023 లలో భాగంగా టూరిజం & హాస్పిటాలిటీ కేటగిరీలో రెస్టారెంట్ సర్వీస్, వంటలు , బేకరీ, హోటల్ రిసెప్షన్ కేటగిరీ లలో, మీడియా మరియు వినోదం విభాగంలో గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ , 3డి – డిజిటల్ గేమ్ కళ , పరిశ్రమ 4.0 వర్షన్ కేటగిరీలో , పెయింట్స్ & కోటింగ్‌లు విభాగంలో పెయింటింగ్ మరియు అలంకరణ కేటగిరీ లలో నూతన ఆవిష్కరణలు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ తరహా ఈవెంట్ లలో 40 విభిన్న ట్రేడ్‌లలో వృత్తి నైపుణ్యాలలో నైపుణ్యాన్ని ప్రదర్శన చేసుకునేందుకు ఇది చక్కటి వేదిక అన్నారు.

భారత నైపుణ్య పోటీలు -2023 లలో భాగస్వామ్యం అవ్వడం, ఇక్కడ గుర్తింపు పొందిన తదుపరి ప్రపంచ నైపుణ్యాల పోటీలలో పాల్గొనే అవకాశం లభిస్తుందని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నైపుణ్య పోటీగా గుర్తింపు పొందాయని, వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ సభ్య దేశంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని మాధవీలత పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాకు చెందిన ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలు, యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ పోటీలలో అత్యుత్తమ పనితీరుకు బెంచ్‌మార్క్‌గా మాత్రమే కాకుండా వృత్తి నైపుణ్యాన్ని అంచనా వేయడానికి భవిష్యత్ కు ఒక లక్ష్య సాధనానికి ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.

అర్హత ప్రమాణం:
1. ప్రపంచ స్థాయి నైపుణ్యం అర్హత ప్రమాణాలను పాటించండి, మెకాట్రానిక్స్, రోబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఇండస్ట్రీ 4.0 కాకుండా అన్ని నైపుణ్యాల కోసం LYON 2024 కోసం పోటీదారులు తప్పనిసరిగా జనవరి 1, 2003న లేదా తర్వాత జన్మించి ఉండాలి. తయారీ రంగం లో పోటీ పడే పోటీదారులు తప్పనిసరిగా 1.1.1999న లేదా తర్వాత జన్మించి ఉండాలన్నారు.

మెకాట్రానిక్స్, రోబోట్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ మరియు ఇండస్ట్రీ 4.0 అనేది టీమ్ స్కిల్ కాంపిటీషన్‌లు, ఇక్కడ పోటీకి 2 వ్యక్తుల బృందం అవసరం.

అభ్యర్థులను ఎలా నమోదు చేసుకోవాలనే దానిపై వివరణాత్మక సూచనలను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే, దయచేసి worldskillsap@apssdc.inలో మా బృందాన్ని సంప్రదించాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాడం కోసం https://skilluniverse.apssdc.in/world-skill-registration ద్వారా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈపోటిల్లో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. భారతదేశ నైపుణ్యాల పోటీలు 2023లో అసాధారణమైన ప్రతిభను కనబరచడానికి, మన జిల్లా ప్రతిష్టను మరింత గా ఇనుమడింప చెయ్యడానికి మీ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని మాధవీలత యువతకు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు. జిల్లాలోని యువత , యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మరింత సమాచారం కోసం పైన పేర్కొన్న ఈమెయిల్ ద్వారా గానీ, 99888 53335 సెల్ నంబర్ ను గానీ, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మరింత సమాచారం కోసం – రాజా కాలబ్ +919133912947 నంబర్ ని సంప్రదించాలని ఆ ప్రకటనలో కలెక్టర్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *