Breaking News

కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేక పూజలు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు టౌన్ పరిధిలో కొవ్వూరు టోల్గేట్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, ప్రకృతి రావణబ్రహ్మ శివలింగాన్ని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత తో పాటు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. ఇరు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన హోంమంత్రికి ముందుగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *