నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్టోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. బుధవారం నాడు నల్లజర్ల మండలం జగన్నాధపురం, మారెళ్ళమూడి గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ముందుగా గ్రామాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ వైయస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి తానేటి వనితకు హారతులు పడుతూ బాణాసంచాతో స్వాగతం పలికారు. జగన్నాధపురం ఆర్సీఎం చర్చిలో హోంమంత్రి తానేటివారింట 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మారెళ్ళమూడిలో సీఎం, హోంమంత్రి ఫ్లెక్సీ కి నిరంతరం జలాభిషేకం చేసే విధంగా ఏర్పాట్ల పై హోంమంత్రి నాయకులను, కార్యకర్తలను అభినందించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజా రంజక పాలన, సుపరిపాలన అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. అందరూ ముక్తకంఠంతో సిద్ధమే అన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు మన వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా కొత్త పెన్షన్ మంజూరుకావాలంటే.. కులం, మతం, పార్టీ చూసి జన్మభూమి కమిటీలు సిపారసు చేస్తే అప్పుడు పెన్షన్ దారులు ఎవరైనా చనిపోతే గానీ వారిస్థానంలో గానీ కొత్తగా పెన్షన్ ఇవ్వలేని దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. పిల్లలకు అమ్మఒడి, మహిళలకు చేయూత, ఆసరా, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి ఎన్నో పథకాల అమలు మహిళా సాధికారిత వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికలకు మోసపూరిత హామీలతో పసుపు, ఎరుపు రంగులు కలసి వస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తతో ఉండి మీకు మేలు జరిగితే మళ్లీ జగనన్న ఆశీస్సులు అందించాలని హోంమంత్రి కోరారు. గత ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాలు సాధించి రికార్డు సృష్టించామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు అన్నీ కలిసి గుంపులు, గుంపులుగా వస్తున్నా.. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో 175 కి గానూ 175 స్థానాల్లో ఘనవిజయం సాధించడం ఖాయమనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News