-18-21 మధ్య ఉన్న కొత్త ఓటరు నమోదు స్వీకరించడం జరుగుతుంది
-ఎపిక్ కార్డుల బదులు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను మేరకు ఫోటో గుర్తింపు కార్డు ల ద్వారా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు
-నామినేషన్లు దాఖలు చేసే విధానం లో అఫిడవిట్లు చాలా కీలకం
-నామినేషన్లు, అఫిడవిట్లు ను ఆర్ వో లు ఉదయం 11 నుంచి మ.3 గంటల వరకు మాత్రమే స్వీకరిస్తారు
-ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలు, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి
-ఈ సి ఐ వెబ్ సైట్ ద్వారా ఓటరు తన ఓటర్ ఐడి వివరాలు తెలుసుకోవచ్చు
-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో సార్వత్రిక ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు, అఫిడవిట్లు సమర్పించే విషయం లో ఎన్నికల కమిషన్ నియమావళి, సమయ పాలన ఖచ్చితంగా పాటించాలనీ కలక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి డా కె.. మాధవీలత పేర్కొన్నారు.
బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డీ ఆర్వో జీ. నరసింహులు, రాజమండ్రీ పార్లమెంటు ఏ ఆర్వో ఆర్. కృష్ణ నాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనం తో కూడి నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజల ద్వారా వచ్చే ఫిర్యాదులు, వివిధ మాధ్యమాల్లో వొచ్చే ప్రతికూల వార్తలు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమేరకు తీసుకున్న చర్యల గురించి ఎప్పటి కప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వొచ్చే తేదీ వరకు ఫారం 7, 8 స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారీ నుంచీ ఫారం 6 దరఖాస్తులు
తుది ఓటరు జాబితా నుంచి మరణించిన, ఓట్ల తొలగింపు విధానం లో ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదం పొందడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆమేరకు జనవరి 23 నుంచి ఈరోజు వరకు 11,331 తొలగించడం జరిగిందనీ , చిరునామా మార్పు 4,392 ఓట్లు , మరణించిన 4,225 ఓట్లు , డూప్లికేట్ 2,701 ఓట్లు , ఉన్నాయన్నారు.
తుది ఓటరు జాబితా ప్రకటించిన తదుపరి 80, 120 ఫారం 6 , 7 , 8 లని స్వీకరించడం జరిగిందనీ, వాటిలో 73, 542 పరిష్కారము చెయ్యగా, ఇంకా 6,578 పెండింగులో ఉన్నట్లు తెలిపారు, వాటిలో ఫారం 6 కీ చెందిన 2,229 , ఫారం 7 లు 2,841 , ఫారం 8 లు 1,508 ఉన్నాయనీ మాధవీలత పేర్కొన్నారు. కొత్త ఓటర్లు గా నమోదు అయిన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ చెయ్యడం జరుగుతుందనీ, ఓటర్లు తమ ఓటు హక్కు ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో పరిశీలించుకునే వెసులుబాటు ఉందన్నారు. జిల్లాకి కొత్తగా లక్షా 70 వేల ఎపిక్ కార్డులు వచ్చాయని, వాటిని ఓటర్ల కు అంద చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు.
ఓటు హక్కు కలిగి ఉండి ఎపిక్ కార్డు లేక పోయిన ఎన్నికల కమీషన్ నిర్దేశించిన ఫొటో ఐడీ తో పొలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు వేసే అవకాశం ఉందని మాధవీలత పేర్కొన్నారు.. అందులో భాగంగా
ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయాలలో డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, ఎన్ పి ఆర్ కింద ఆర్ జీ ఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, స్టేట్ బ్యాంక్ లేదా పోస్టాఫీసు నుండి ఫోటోతో కూడిన పాస్‌బుక్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫోటోగ్రాఫ్‌లతో కూడిన సేవా గుర్తింపు కార్డులు ఉన్నాయి. /PSU/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ఫోటోగ్రాఫ్‌లతో కూడిన పెన్షన్ పత్రాలు, కార్మిక మంత్రిత్వ శాఖ కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్‌లు లేదా ఎంపీ లు/ ఎమ్మేల్యే లు/ ఎమ్మెల్సీ లకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు చూపి ఓటు వేసే అవకాశం ఉందన్నారు.
ఈ సమావేశంలోనే జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, కే ఆర్ ఆర్ సి ఎస్ డి డి ఆర్. కృష్ణ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, కాంగ్రెస్ నలబాటి రమేష్ (శ్యామ్) , బిజేపి పి వి లక్ష్మీ , సీపీఐ (ఎమ్) ఏస్ ఎస్ మూర్తి , టిడిపి సిహెచ్. శ్రీనివాస రావు, వైసిపి వై వి ఎస్ శ్యామల, ఎలక్షన్స్ డిటి ఎమ్. సునీల్ కుమార్, గిరీష్, తులసి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News