Breaking News

విజయవాడ నగర అధ్యక్షుడు గా నన్ను నియమించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు…

-నాకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాలను గుర్తించడమే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ నగర అధ్యక్షుడు గా నన్ను నియమించిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు, నాకు పదవి ఇవ్వడం అంటే బలహీనవర్గాల గుర్తించడమేనని, పార్టీ కేటాయించిన పదవుల్లో 50 శాతం బిసి ఎస్సీ ముస్లింలకు కేటాయించడం హర్షణీయంమని, కమిటీల కూర్పులో మహిళలకు యువతకు పెద్ద పీట వేశారని, పార్టీ కూర్పు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల దగ్గరనుంచి మద్దతు లభిస్తుందని, ఈ నెలాఖరులోపు విజయవాడ నగర కమిటీని ప్రకటించి వారితో పాటు ప్రమాణస్వీకారం చేస్తానని, తదుపరి టెంపుల్ షాడో కమిటీ మరియు 64 డివిజన్స్ కమిటీల ఏర్పాటును చేపడతామని, ఆస్తి పన్నుపెంపు జీవోలు నెంబర్ 196, 197, 198 తక్షణమే రద్దు చేయాలని, చెత్త పై పన్నుని వెంటనే తొలగించాలనీ, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 2 రద్దు చేయడం అంటే ప్రభుత్వానికి చెంపదెబ్బఅని,ఇక నుండి అయినా సీఎం జగన్  నియంతృత్వ పోకడలు ఆపాలని,ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని మహేష్ అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *