విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తశుద్ధితో పనిచేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గురువారం తాడిగడప లోని తమ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సుజనా చౌదరి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ లోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, గుడివాడ నరేంద్ర రాఘవ, హర్షద్, అప్పాజీ రావు, మైలవరపు రత్నకుమారి, అత్తులూరి ఆదిలక్ష్మి, మైలవరపు మాధురి లావణ్య, కూటమినేతలు మైలవరపు దుర్గారావు, పైలా సురేష్, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.
-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 …