Breaking News

ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి ద్వారా లబ్దిదారులకు అందజేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పదకాన్ని నగదు బదలీ పద్ధతి (DBT) ద్వారా లబ్దిదారులకు అందజేయడానికి సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల తాలూకు నగదు లబ్దిదారుల ట్యాంక్ ఖాతాల లో జమ చేయడాన్నే నగదు బదలీ పద్ధతి అంటారు. నగదు బదిలీ ద్వారా పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటుంది. వీటిని పొందడానికి ప్రతి లబ్దిదారుడు NPCI మ్యాపర్ లో తమ ఆధార్ కి బ్యాంకు అకౌంట్ ను జత (సీడింగ్) చేయవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం సుమారు 68 లక్షల మందికి NPCI మ్యాపర్ లో ఆధార్ సీడింగ్ జరగలేదని తెలుస్తుంది. వెంటనే వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం GVWV & VSWS డిపార్ట్మెంట్ ను ఆదేశించింది.

పోస్ట్ ఆఫీసు నెట్వర్క్ దృష్టిలో ఉంచుకొని GVWV & VSWS డిపార్ట్మెంట్ వారు పెండింగ్ లో ఉన్న అందరికీ NPCI లింకు చేయమని చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ (CPMG) ఆఫీసు ను కోరడం జరిగింది. మన రాష్ట్రం లో 10వేల పై చిలుకు పోస్ట్ ఆఫీసులు కలవు. ఈ అవసరాన్ని దృష్టి లో ఉంచుకొని ప్రతి లబ్దిదారుడుకి ఇబ్బంది కలగకుండా గ్రామ ప్రజల సౌకర్యార్ధం తమ గ్రామం లోనే గ్రామ లేదా వార్డ్ సచివాలయాల వద్ద మా పోస్ట్ ఆఫీసు సిబ్బంది ద్వారా అకౌంట్ ఓపెనింగ్ సదస్సు (క్యాంప్) లను నిర్వహిస్తున్నాము.

ఈ IPPB అకౌంట్ ఓపెన్ చేయటానికి కేవలం ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబరు సరిపోతుంది. ఎటువంటి Xerox కాపీలు లేదా ఫోటో లు అవసరం లేదు. ఈ క్యాంప్ లను ఈ నెల 15వ తేది వరకు గ్రామ లేదా వార్డ్ సచివాలయాల వద్దనే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఖాతా వల్ల లబ్దిదారులు బ్రాంచ్ తో సంబంధం లేకుండా దేశం లో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీసు లో ఖాతాపరమైన సేవలను పొందవచ్చు. నిరక్షరాస్యులు కూడా తమ బయోమెట్రిక్స్ ద్వారా ఈ ఖాతా లో నగదు జమ, ఉపసంహరణ వంటి సేవలను సులభతరంగా పొందవచ్చు. ఈ IPPB ఖాతాను వేరే ఏ ఇతర UPI యాప్స్ (GPay, Phonepe) కి అయిన లింక్ చేసుకొని UPI సేవలను పొందవచ్చు. కావున ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని ఎమ్. నరసింహ స్వామి సీనియర్ సూపరింటెండెంట్ ఆప్ పోస్టాఫీసెస్ తెలిపారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *