Breaking News

ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తపాలా శాఖ(DOP), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయ స్థాయిలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా కొత్త ఖాతాలను తెరవడం మరియు ఆధార్ లింకేజీని సులభతరం చేయడానికి 15 నవంబర్ 2024 వరకు క్యాంపులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) లబ్దిదారుల కోసం నిర్వహిస్తోంది. స్థానిక జిల్లా యంత్రాంగం సహకారంతో గ్రామ, వార్డు సచివాలయ స్థాయిల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. కొత్త IPPB బ్యాంక్ ఖాతాలను తెరవడం మరియు ఇప్పటికే ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఖాతాలకు ఆధార్ను లింక్ చేయడం, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మ్యాపింగ్ను సులభతరం చేయడం ప్రాథమిక లక్ష్యం. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న 64.81 లక్షల ఖాతాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 వేల పై చిలుకు పోస్ట్ ఆఫీసుల ద్వారా పునరుద్ధరించడం జరుగుతుంది.

ప్రయోజనాల ముఖ్యమైన వివరాలు:
అర్హత: 18 సంవత్సరాల పైబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పౌరులు.

లక్ష్యం: 64,81,632 నిరుపయోగంలో ఉన్న ఖాతాలను పునరుద్ధరించడం.

గడువు: అన్ని ఖాతాలు నవంబర్ 15, 2024 నాటికి పునరుద్ధరించబడతాయి.

ఈ ప్రత్యేక క్యాంపులు, అర్హులైన పౌరులందరికీ ఆర్థిక సాధికారత మరియు ప్రభుత్వ ప్రయోజనాలను సజావుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయబడేలా పోస్టల్ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కలిసి పనిచేయనున్నాయి.

మరింత సమాచారం కొరకు లబ్దిదారులు తమ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసును సంప్రదించగలరని K. Prakash, Chief Postmaster General తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *